రాష్ట్రీయం

కేసీఆర్‌ను తిడితే అధికారం వస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టి, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతూ చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కేవలం కేసీఆర్‌ను తిట్టినంత మాత్రాన ఏపీలో అధికారం దక్కుతుందనుకుంటే అది బాబు భ్రమ, అవివేకమే అవుతుందన్నారు. కేసీఆర్, చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రధాని మోదీపై దూషణలు చేస్తూ తమ పాపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కన్నా దుయ్యబట్టారు. ఆదివారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అభ్యర్థులకు ఆయన బీ-్ఫరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ పోలవరం ముంపుప్రాంతాలను వెనక్కు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, మచిలీపట్నం పోర్ట్‌ను తెలంగాణకు తరలించుకు పోవడానికే కేసీఆర్ ఇక్కడకు వస్తున్నారని అనడం టీడీపీ నేతల అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు బాబు విజయానికి ఇతోధికంగా సేవ చేస్తున్నారని, వారు ధరించిన ముసుగులు తీసి బహిరంగంగా ఎన్నికల్లో పోటీకి దిగవచ్చని కన్నా సవాల్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో బాబు పాపాలచిట్టా బద్దలై దారుణమైన ఓటమిని చవిచూడక తప్పదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలను బీజేపీ అభ్యర్థులను ప్రకటించిందని, వచ్చే ఎన్నికల్లో తాము అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్నామన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, తిరిగి మోదీ ప్రధాని కావడం తథ్యమని స్పష్టం చేశారు. చేసిన పాపాలకు శిక్షగా అటు దేశంలో, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కనుమరుగుకాక తప్పదని కన్నా జోస్యం చెప్పారు.
చిత్రం.. బీజేపీ అభ్యర్థులకు బీ-్ఫరాలు అందజేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ