రాష్ట్రీయం

రబీ పూర్తయినా అందని పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 2018-19 యాసంగి పంటకు రైతులకు చెల్లించాల్సిన రైతుబంధుకు నిధుల కొరత ఏర్పడ్డది. 2018 వానాకాలం (ఖరీఫ్)లో రైతులకు చెల్లించాల్సిన రైతుబంధు నిధులను 2018 మే నెలలోనే చెల్లించారు. దాదాపు 5000 కోట్ల రూపాయలు రైతులకు చెక్కుల రూపంలో చెల్లించారు. 2018-19 యాసంగి పంట సీజన్ 2018 అక్టోబర్-నవంబర్ నెలల్లోనే ప్రారంభం అయింది. డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయం అయినప్పటికీ, కొంత మంది రైతులకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ పథకం ఆన్‌గోయింగ్ పథకం కాబట్టి అడ్డు చెప్పలేదు. డిసెంబర్ 7 న పోలింగ్ జరగగా, అప్పటి వరకు 30 లక్షల మందికి పైగా రైతులకు రైతుబంధు నిధులు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఖాతాల్లో డబ్బు పడటం నిలిచిపోయింది. యాసంగి పంటకు సంబంధించి రైతుబంధు డబ్బును కనీసం డిసెంబర్ చివరివరకైనా ఇస్తారేమోనని రైతులు ఎదురు చూశారు. అనధికారిక అంచనా ప్రకారం సుమారు 2000 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు అకౌంట్లలో వేయాల్సి ఉన్నప్పటికీ, వేయలేదు. వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ ఇందుకు సంబంధించిన బకాయిల డబ్బును విడుదల చేయడం లేదని తెలిసింది. పైగా 2018-19 బడ్జెట్‌కు సంబంధించి చేయాల్సిన ఖర్చు 2019 మార్చి 31 తో ముగుస్తోంది. అంటే మరో వారం రోజుల్లోగా రైతుబంధు డబ్బు రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉంది. జమ అవుతుందా లేదా అయోమయంగా ఉందని అకౌంట్లలో డబ్బు పడని అనేక మంది రైతులు వాపోతున్నారు.