రాష్ట్రీయం

టీడీపీ-టీఆర్‌ఎస్ మధ్యే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు: నేడు రాష్ట్రంలో తెలుగుదేశం, టీఆర్‌ఎస్ మధ్యే పోటీ జరుగుతోందని, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ, టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కైందని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని, రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని క్లాక్‌టవర్ వద్ద జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ ఎన్నికల్లో తనను ఆశీర్వదించండి, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానన్నారు. ఒకవేళ జగన్‌కు ఓటేస్తే నరేంద్ర మోదీకి వేసినట్లేనని అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరచానన్నారు. కృష్ణా జలాలు హంద్రీ-నీవా ద్వారా నీళ్లు తెచ్చానన్నారు. మన రాష్ట్రంలో పెత్తనం చెలాయించడానికి కేసీఆర్, వైసీపీలు లాలూచీపడి మనపై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే వైసీపీక పడుతుందన్నారు. వైసీపీ, కేసీఆర్‌లు కలసి ఎన్నికల్లో కుట్రలు పన్నుతున్నారన్నారు. హైదరాబాద్‌లో మనం అరవై ఏళ్లు కష్టపడి అభివృద్ధి చేస్తే తనదని కేసీఆర్ అవమానించి అక్కడ నుంచి పంపారన్నారు. అలాంటి పార్టీతో వైసీపీ లాలూచీ పడిందన్నారు. ఈ ఎన్నికల్లో పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అమరనాధరెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా శివప్రసాద్‌ను గెలిపించాలన్నారు. తానొక సైనికుడిగా పని చేస్తున్నానని, రాష్ట్ర ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానన్నారు. పొరపాటున వైసీపీకి అధికారం కట్టబెడితే రాష్ట్రంలో రౌడీరాజ్యం వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీని ఏకపక్షంగా గెలిపించాలన్నారు. ఈ ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్, వైసీపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వైసీపీ దగాకోరు రాజకీయాలకు పాల్పడుతూ నరేంద్ర మోదీకి ఊడిగం చేసిందని విమర్శించారు. టీడీపీని అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ పెత్తనం చెలాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక లోటు ఉన్నా దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ప్రజలు వాస్తవాలను గుర్తించి టీడీపీకి అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో అరాచకశక్తులు ఏదోవిధంగా అధికారంలోకి రావడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయని, వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. అంతకుముందు పలమనేరులో టీడీపీ అధినేత రోడ్ షోలో పాల్గొన్నారు.
ఆంధ్రను దోచుకోవాలని కేసీఆర్ కుట్ర
అమరావతి: ఎన్నికల సమరంలో ప్రతి కార్యకర్త ఓ కమాండర్‌లా పోరాడేందుకు సుశిక్షితులు కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎలక్షన్ మిషన్-2019పై బూత్ కమిటీ కన్వీనర్లు, సేవామిత్ర, పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయి విజయపథంలో పయనిస్తోందని చెపుతూ, వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఓ ఆట ఆడుకోవాలని సూచించారు. తమది రాష్ట్ర హక్కుల కోసం చేస్తున్న ప్రజా పోరాటమని అభివర్ణించారు. కాపు రిజర్వేషన్ల అంశం తమ పరిధిలోది కాదన్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తిరిగి ఆ వర్గానికి న్యాయం చేస్తామంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. జగన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపిచ్చారు. సమాజంలో నేరస్థుడిని ప్రజలు దోషిగా చూస్తారని, అయితే జగన్ మాత్రం రాజకీయ నేతగా చలామణి అవుతున్నారని వ్యాఖ్యానించారు. అరాచకాలను రెచ్చకొట్టేందుకు నీచ రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. ఆయన అరాచకశక్తి అనటానికి ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన కేసులే నిదర్శనమన్నారు. 48 పేజీల అఫిడవిట్‌లో 31 కేసులు నేరచరిత్రకు నిదర్శనాలని పునరుద్ఘాటించారు. దేశంలో ఏ రాజకీయ వేత్త అఫిడవిట్‌లోనూ ఇన్ని కేసులు లేవన్నారు. చిన్నాన్న వైఎస్ వివేకా హత్యను కూడా రాజకీయ కోణంలో ప్రచారానికి వినియోగించుకోవాలనే దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఓ వ్యక్తిని అంచనా వేసి గౌరవం ఇచ్చేముందు అతని గుణగణాలు, మంచిచెడులు ఆలోచిస్తారని చెప్పారు. అదేవిధంగా ఓటేసే ముందు కూడా ఆలోచన చేస్తారని, 31 కేసులున్న జగన్‌కు ఎవరైనా ఓటు వేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అరాచక పార్టీకి ఓటేస్తే మనుగడకు ముప్పొస్తుందని హెచ్చరించారు. అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్‌లో జగన్ తరహా నేరాల నిరోధంపై శిక్షణ ఇస్తారని గుర్తుచేశారు. రాష్ట్రంలో టీడీపీ పవనాలు వీస్తున్నాయని, పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు. పార్టీ నేతలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయావకాశాలపై దృష్టి సారించాలన్నారు. ప్రత్యర్థి వైసీపీ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చిత్తు చేయాలని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు.

చిత్రం.. పలమనేరులో రోడ్ షోలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు