రాష్ట్రీయం

టీడీపీ అభ్యర్థిపై ఉల్లంఘన కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, మార్చి 25: చిత్తూరు జిల్లా సత్యవేడులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల నియమావళికి తూట్లు పొడిచారు. పట్టణంలోని గాంధీరోడ్డు, నేతాజీ రోడ్డు మార్గాల్లో పలు చోట్ల టీడీపీకి సంబంధించిన పసుపు జెండాలను రోడ్లపై కట్టారు. దీనిపై స్పందించిన స్థానిక సీఐ రాజేంద్రప్రసాద్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జెడ్డా రాజశేఖర్, మండల అధ్యక్షులు పరమశివన్‌లపై సెక్షన్ 188/171 హెచ్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.