రాష్ట్రీయం

ఇదేమిటి మాస్టారూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్: ఉపాధ్యాయులే ఓటింగ్‌లో తడబడి తే..సామాన్యుల సంగతేమిటీ?. ఇప్పుడదే జరిగింది. నల్లగొండ- ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్ల ని ఓట్లు భారీ సంఖ్యలో ఏకంగా 858 ఓట్లు ఉండటం చర్చనీయాంశమైం ది. సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వర్తిస్తు నిరక్షరాస్యులకు ఓటింగ్‌పై అవగాహన కల్పించే టీచర్లే ఏకంగా 858ఓట్లు చెల్లకుండా వేయడం అంద ర్నీ విస్మయ పరిచింది. ఈనెల 22న బ్యాలెట్ పద్ధతిలో జరిగిన పోలింగ్‌లో మొత్తం 20,888ఓట్లకుగాను 18,885మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నా రు. ఇందులో 18,027ఓట్లు చెల్లుబాటుకాగా 858ఓట్లు చెల్లకుండా పో యాయి. వీటిలో సగం చెల్లినా ఎలిమినేషన్ రౌండ్ అవసరం లేకుండా నే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే విజేత అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొంది ఉండేవారని భావిస్తున్నారు. మొత్తం మీద ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో చెల్లని ఓట్ల వ్యవహారం ఓటింగ్ నమోదుపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని చాటుతుంది.