రాష్ట్రీయం

మొరాయించిన ఈవీఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమయ్యాక చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. గంటల కొద్దీ ఈవీఎంలు మొరాయించి, ఓటర్ల సహనాన్ని పరీక్షించాయి. చాలా కేంద్రాల్లో దాదాపు మూడు నుంచి నాలుగు గంటల వరకూ ఈవీఎంలు పని చేయలేదు. దీంతో గంటల తరబడి ఓటర్లు మండుటెండలో నిలబడాల్సి వచ్చింది. పనిచేయని ఈవీఎంలతో విసిగిపోయిన ఓటర్లు పలు చోట్ల పోలింగ్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఓటు వేసేందుకు వచ్చిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది కూడా మొరాయించిన ఈవీఎంతో ఒకసారి వెనుదిరగాల్సి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్‌ల్లో ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించారు. మంగళగిరిలో ఒక బూత్‌లో మాక్ పోలింగ్ ఉదయం 7.20 గంటలకు కూడా సాంకేతిక కారణాలతో పూర్తి కాలేదు. మాక్ పోలింగ్ తరువాత ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అయితే చాలా నియోజకవర్గాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఎండాకాలం కావడంతో ఓటు వేసేందుకు ఉదయానే్న పోలింగ్ కేంద్రాలకు పలువురు తరలివచ్చారు. అయితే విజయవాడ, విశాఖ, అనంతపురం, తదితర నియోజకవర్గాల్లో దాదాపు 1800 ఈవీఎంలు పని చేయలేదని అనధికార అంచనా. ఈవీఎంలు సరిచేసేందుకు రెండు నుంచి
నాలుగు గంటల సమయం పట్టింది. అప్పటివరకూ చాలా మంది ఎండను సైతం లెక్క చేయకుండా క్యూలో నిల్చున్నారు. కొన్నిచోట్ల 7 ఓట్లు వేసిన తరువాత ఈవీఎంలు పని చేయడం ఆగిపోయాయి. వేలిపై సిరా గుర్తు వేశాక ఈవీఎం పనిచేయకపోవడంతో దాదాపు రెండున్నర గంటల సేపు ఒక ఓటరు పోలింగ్ కేంద్రంలో ఉండాల్సిన పరిస్థితి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. విజయవాడలో వైకాపా ఎంపీ అభ్యర్థి పీవీ ప్రసాద్ కూడా ఈవీఎం పనిచేయని కారణంగా గంటకుపైగా క్యూలైన్‌లో నిలబడాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపల్ హైస్కూల్‌కు వెళ్లారు. అక్కడ ఈవీఎం కూడా పనిచేయకపోవడంతో కొంత సేపు వేచిచూసి వెళ్లిపోయారు. మరోసారి వచ్చి ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలాచోట్ల పోలింగ్ సిబ్బందితో ఓటర్లు వాగ్వివాదానికి దిగారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే ఇలా జరగడాన్ని టీడీపీపై చేస్తున్న కుట్రగా కొంతమంది మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంత భారీ సంఖ్యలో మొరాయించడంపై ఓటర్లు అనుమానాలు వ్యక్తం చేయడం గమానార్హం. ఈవీఎంలను మరమ్మతు చేసే సాంకేతిక సిబ్బందిని తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం వల్ల కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభంలో జాప్యానికి కారణమైంది. గంటల తరబడి ఎండలో ఉండలేక చాలామంది ఓటర్లు వెళ్లిపోవడం కనిపించింది. అనధికారికంగా దాదాపు 1800 ఈవీఎంలు సరిగ్గా పని చేయలేదని ఆరోపణలు వచ్చినా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాత్రం 362 ఈవీఎంలు పని చేయలేదని, తమ సిబ్బంది వెంటనే హాజరై సమస్యను పరిష్కరించారని చెప్పడం గమనార్హం.

చిత్రం.. విజయవాడలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పనిచేయకపోవటంతో ఆందోళనకు దిగిన ఓటర్లు