రాష్ట్రీయం

ఖమ్మంలో పోలింగ్ 68 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 11: ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 87శాతం పోలింగ్ నమోదు కాగా పార్లమెంట్‌లో కేవలం 68శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గంలలోనూ పోలింగ్ గతం కంటే తక్కువగా నమోదైంది. ఖమ్మం అసెంబ్లీలో 63.45, పాలేరులో 70, మధిరలో 67.24, వైరాలో 73.88, సత్తుపల్లిలో 70, కొత్తగూడెంలో 61, అశ్వారావుపేటలో 74.70శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 15,13,094మంది ఓటర్లలలో 10,27,735మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా కూసుమంచి మండలం దేవునితండా, దమ్మపేట మండలం లచ్చగూడెం, జూలురుపాడు మండలం సూరారం, ఏన్కూరు మండలం మూలపోచారం గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించలేదని అందుకే తాము ఓటు వేయమని బ్యానర్లు కట్టి నిరసన తెలిపారు. అయితే మధ్యాహ్నానానికి ఆ గ్రామాలకు చేరుకొని వారికి సర్దిచెప్పి ఓట్లు వేసేలా చేశారు. మరోవైపు అనేక చోట్ల ఈవీఎంలు మోరాయించటంతో కొత్త వాటిని తీసుకువచ్చి పోలింగ్ నడిపించారు. అడుగడుగునా పోలీసులు నిఘా ఏర్పాటు చేయటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా నడిచింది. దివ్యాంగులు, వృద్ధుల కోసం అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. దివ్యాంగులు, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో అధికశాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టు ప్రాంతాలలో అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయటంతో ప్రజలు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, మంచినీటి సౌకర్యం సరైన రీతిలో కల్పించకపోవటంతో ఓటర్లు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు, రేణుకాచౌదరి ఖమ్మం తమ ఓటు హక్కును వినియోగించుకొని జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఖమ్మం నగరంలో సిద్దారెడ్డి కళాశాల పోలింగ్ బూత్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావటంతో టీఆర్‌ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ రేణుకాచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన పరిశీలించారు. పోలైన ఓట్లలో ఎక్కువ శాతం మహిళలవే కావటం గమనార్హం.