ఆంధ్రప్రదేశ్‌

ఎదురీతే జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 8: తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పర్వదినం పరమార్థం జీవితమన్నది సమస్యల సమ్మేళనమని, ఆచితూచి అడుగువేస్తూ ముందుకు వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉగాది పచ్చడిలో సమ్మిళితంగా ఉండే తీపి, పులుపు, వగరు రానున్న కాలంలో ఎదురయ్యే శుభాశుభాలను తెలియచేస్తాయని అన్నారు. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక నేక్ కళ్యాణ మండపంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. జీవితంలో సమస్యలు తప్పవు. వాటిలోనే అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గత ఏడాది తుళ్లూరులో ఉగాది ఉత్సవాలను నిర్వహించాం. కనీసం ఉత్సవాలు జరుపుకొనేందుకు స్థలం కూడా లేని పరిస్థితి. రెండో సంవత్సర ఉగాది వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామని, మనో నిబ్బరంతో ముందు కు కదలడం వలనే ఇది సాధ్యమైందని చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి చరిత్ర ఖండాంతరాల్లో వ్యాపింపచేయాలన్నది తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. కష్టపడి పనిచేసే రైతులు ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఉన్నారని, దిగుబడిని పెంచితే ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఫైబర్ కనెక్టివిటీ విప్లవాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. 149 రూపాయలకే టివి, ఇంటర్నెట్, ఫోన్ తదితర సౌకర్యాలను జూలై నుంచి కల్పించనున్నామని చంద్రబాబు చెప్పారు. కృష్ణా నదిపై ఇష్టానుసారంగా నిర్మాణాలు సాగిస్తున్నారని. మనకు న్యాయబద్ధంగా రావల్సిన నీరు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానానికి, వనరులకు కొదవ లేదని చంద్రబాబు అన్నారు. కష్టపడే మనస్తత్వం ఉన్నప్పుడు రాష్ట్భ్రావృద్ధి మరింత వేగంగా జరుగుతుందని చంద్రబాబు చెప్పారు.
మనస్విని అభినందించిన సిఎం
ఇదిలా ఉండగా విజయవాడకు చెందిన మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని మనస్విని అమరావతి నిర్మాణం కోసం తన కిడ్డీబేర్‌లో దాచుకున్న లక్షా వెయ్యినూట పదహారు రూపాయలను తనకు ఇచ్చిందని, ఆ చిన్నారి ఆలోనను, తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తిని అభినందిస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు.

చిత్రం... మంత్రులతో కలిసి ఉగాది పచ్చడి రుచి చూస్తున్న సిఎం చంద్రబాబు

చిత్రం... పంచాంగ పఠనం చేస్తున్న శ్రీనివాస గార్గేయ