రాష్ట్రీయం

హైకోర్టు భవనానికి నూరేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన ఈ భవన నిర్మాణం 1919 మార్చి 31 నాటికి పూర్తయినా 1920 ఏప్రిల్ 20న అధికారికంగా ప్రారంభమైంది. నిజాం కాలం నాటి హైదరాబాద్‌పై బ్రిటిష్ ప్రభావం ఎక్కువగా ఉండేది, 1800 అక్టోబర్‌లో ఈస్టిండియా కంపెనీతో నిజాం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా నిజాం కోర్టు కూడా బ్రిటిష్ వారి ఆధ్వర్యంలోనే జరిగేది. సాలార్‌జంగ్ హైదరాబాద్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సరికొత్త న్యాయవ్యవస్థ రూపొందించారు. హైకోర్టు మొదట పత్తర్‌ఘట్టిలో ఉండగా 1909లో వరదలు రావడంతో లాల్‌బాగ్‌లోని నవాబ్ సర్ అస్మాన్ జా దేవిడీకి మార్చారు. 1912లో కలరా వ్యాపించడంతో దేవిడి నుండి పబ్లిక్ గార్డెన్స్‌కు మారింది. నాలుగు నెలల తర్వాత చత్తాబజార్ లక్కడ్‌కోట్‌లోని సాలార్‌జంగ్ బహుదూర్ నివాసంలోకి తరలించారు. అక్కడ అనువుగా లేకపోవడంతో 1914లో సైఫాబాద్‌లో నవాబ్ సత్రజ్ జంగ్ నుండి భవనాన్ని అద్దెకు తీసుకుని అక్కడికి మార్చారు.