రాష్ట్రీయం

నిప్పుల కొలిమి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి: భూపాలపల్లి, చెల్పూర్‌లు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఏకంగా జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చెల్పూరు సమీపంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఉష్ణోగ్రతల పట్టికలో 45 డిగ్రీలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఈ నెలలో 40 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది మాత్రం ఏకంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. మధ్యాహ్నం 11 నుండే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోజువారి పనులకు ఆటంకం కలుగుతుంది. 12 తరువాత ప్రజ లు బయటకు రావాలంటే జంకుతున్నారు. భారీ వాహనాలు సైతం ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. సాయంత్రం 6 తరువాతే జనం బయట కనిపిస్తున్నారు. భూపాలపల్లి ఓపెన్‌కాస్టు గనులతో పాటు కాకతీయ థర్మల్ విద్యుత్‌కేంద్రం వల్ల గత ఐదు సంవత్సరాలుగా ఉష్ణోగ్రతలు ఇక్కడ పెరుగుతూ వస్తున్నాయి. ఇంకా మే, జూన్ నెలలు రాకముందే ఉష్ణోగ్రతలు 45కు చేరడంతో జనం భేజారవుతున్నారు. కేటీపీపీ వల్ల సుమారు 15 కిలో మీటర్ల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. గత సంవత్సరం కన్నా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలోనే పెరగడం వల్ల ఈ సారి కూడా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెపుతున్నారు.