రాష్ట్రీయం

విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఏప్రిల్ 24: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చడం దారుణమని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ నిరసన తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణలో ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం 17మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం తనను కలచివేసిందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుండి ఫలితాల వెల్లడి వరకూ ప్రతి దశ పైనా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయని తెలిపారు. వాటిని నివృత్తి చేసి, నిజాలు వెల్లడించాలన్నారు. సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎదురుదాడి చేసేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థులు కోరుకుంటున్నట్లు వెంటనే రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని కోరారు. జీవితం చాలా విలువైనదని, ఈ ఫలితాలతో నిరాశ చెందవద్దన్నారు. జనసేన పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని, ఇన్ని తప్పదాలకు కారణమైన బోర్డు అధికారులు, సాఫ్ట్‌వేర్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిగిన తప్పిదంపై సమగ్ర విచారణ జరిపించాలని పవన్‌కళ్యాణ్ డిమాండ్ చేశారు.