రాష్ట్రీయం

తెలంగాణకు ఐఏఎస్ అనుదీప్ కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 11: 2017లో అఖిల భారత సర్వీసులకు ఎంపికైన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను వివిధ రాష్ట్రాలకు కేడర్లకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ శనివారం అధికారికి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నుండి ఉత్తీర్ణతను సాధించిన మొదటి ర్యాంకర్ దురిశెట్టి అనుదీప్, 6వ ర్యాంకర్ కోయ శ్రీహర్షలను తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారులుగా పరిగనిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం వీరిద్దరూ ముసోరిలో శిక్షణలో ఉన్నారు. ఈ విషయమై ఆంధ్రభూమి ప్రతినిధి దురిశెట్టి అనుదీప్‌ను సంప్రదించగా స్వరాష్ట్రానికి సేవచేసే అదృష్టం కల్పిస్తూ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిగా కేటాయింపు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. నా జీవితానికి నాన మనోహర్‌తో పాటు అమ్మ జ్యోతి వల్లే ఈ ఖ్యాతి అని వారే స్పూర్తి ప్రధాతలను ఐఎఎస్ ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచేందుకు నా ప్రతి అడుగులో వారి చేయూత వెళకట్టలేనిదన్నారు. నేడు ఇంతటి స్థాయికి ఎదగడానికి నాన కంటే ఎక్కువగా అమ్మ అహర్నిశలు పడ్డ శ్రమ ఫలితమే ఆల్ ఇండియా టాపర్‌గా నిలబెట్టిందని అన్నారు. తాను విద్యార్థి దశనుంచే ఉదయం నిద్రలేపి 6.30గంటల కల్ల నా దుస్తులు ఇస్ర్తి చేసి బడిబాట పట్టించేదని చదువు గురించి ఏనాడు ఒత్తిడి పెంచేంది కాదన్నారు. చదువుతో పాటు ఆటలకు సమయం కేటాయించాలని నాకు బోధించిన తొలి గురువు మా అమ్మేనని, క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం అని తాను ఓడిన ప్రతిసారి గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని, గెలిచినప్పుడు ఆనందం, ఓడినప్పుడు బాధ పడకూడదని నన్ను సముదాయించేదన్నారు. సివిల్స్ కొరకు 5సార్లు ప్రయత్నిస్తే మూడు సార్లు ఓడినా అదైర్య పడొద్దని అమ్మ దైర్యం చేప్పేదన్నారు. మానసిక వికాసానికి ఆటలు ఎంత అవసరమో ఆనాడు కాదు ఈనాడు నాకు తెలిసిందన్నారు. అందువల్లే నేను ముస్సోరి అకాడమీలో ఫుట్‌బాల్ కెప్టెన్‌గా రాణించగలిగానని, అఖిల భారత సర్వీస్ ప్రొబేషనర్ల పోటీల్లో రన్నర్ అప్‌గా నిలిచానన్నారు. చదువు, ఆటలకు సమాన ప్రాధాన్యత ఇస్తే జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఎదురుడ్డి నిలువ వచ్చని నూరి పోసిన ధీరవనిత అమ్మ అని కొనియాడారు. ఐఐటిలో ఇంజనీరింగ్ సీటు కొరకు సన్నద్దమయ్యే సమయంలో చికెన్ ఫాక్స్‌కు గురయ్యానని, పరీక్ష రాయలేక పోయానని మరో అవకాశం రావడంతో బిట్స్ పిలానీలో మంచి ర్యాంకుతో ఎలక్ట్రానిక్స్‌లో సీటి వచ్చిందని, రాజస్థాన్‌లో నాలుగేళ్లలో ఓ కొత్త ప్రపంచాన్ని చూశానని, అదే తన జీవిత ఎదుగుదలకు మలుపుగా బావిస్తున్నానన్నారు. పండుగలకు, శుభకార్యాలకు దూరమయ్యానని, ఇంజనీరింగ్ పూర్తయ్యాక రెండేళ్ల పాటు ఢిల్లీలో ప్రిపరేషన్ ఆ తరువాత మూడు ఏళ్లు ఐఆర్‌ఎస్ అధికారిగా ఫరదాబాద్‌లో ట్రైనింగ్, హైదరాబాద్‌లో విధులు ఏడేళ్ళు ఇంటి మొఖం చూడలేక పోయానన్నారు. ఐఏఎస్‌లో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచినట్లు ఫలితాలు వెలువడ్డాక రాష్టప్రతి విందుకు ఆహ్వానించడం, ప్రధాన మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లు విందుకు ఆహ్వానించినప్పుడు ఉద్వేగానికి లోనై ఇంత గొప్ప గౌరవం అందించావురా కన్నా, మా జీవితానికి ఇది చాలు అంటూ సంభోదించినప్పుడు ఆనందం పట్టలేనివన్నారు. ఆ మధుర క్షణాలు నేటికీ మరచిపోనని, మరోసారి గుర్తుచేసుకున్నారు. 2017లో చివరి ప్రయత్నం సివిల్స్ సాధనకు చేశానని, అసిస్టెంట్ కమీషనర్‌గా ఉద్యోగ ఒత్తిళ్లతో సమయం దొరుకుతుందా అనే సందేహాలు వ్యక్తం అయినా సమయం పాలన అనుకుంటే దొరుకుతుందని ప్రపంచంలో ఏదైనా చేయగలనంటే చేసి తీరుతామని చేయలేమని అనుకుంటే చేతగాని వారిలా మిగిలి పోతామని, పట్టుదలతో అసాధ్యమనేది ఏదీ లేదని, ఐఏఎస్ పరీక్ష రాసా..ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచానన్నారు. మొదటి ర్యాంక్ వచ్చినప్పుడు అమ్మ ఆనందానికి అవదులు లేవని, ఫోన్‌లోనే సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆనందభాష్పాలు రాల్చిందన్నారు. మే 24న బధ్రాది కొత్తగూడెం అసిస్టెంట్ కలెక్టర్‌గా విధుల్లో చేరబోయే మధుర క్షణాలు జీవితంలో మరిచిపోలేనివని దురిశెట్టి అనుదీప్ వెల్లడించారు.
చిత్రం... దురిశెట్టి అనుదీప్