రాష్ట్రీయం

టీటీడీ నాణేల తరలింపులో గోల్‌మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 11: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించే కానుకల్లో చిల్లర నాణేల తరలింపులో పెద్ద గోల్‌మాల్ జరుగుతోందని దీని వెనుక కొందరు ఉన్నతాధికారుల హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి హుండీలో భక్తులు వేసిన రూ.1, రూ. 2, రూ. 5, రూ. 10లు పరకామణిలో దాదాపు రూ. 30 కోట్లు ఉంటే, ఎస్వీయూ ఆంధ్రాబ్యాంక్‌లో రూ. 20 కోట్లు వరకు ఉన్నాయన్నారు. వీటిలోకొన్ని పనికిరాని స్థితికి చేరుకున్నాయని అన్నారు. వీటిని వేరువేరుగా గోతాముల్లో ప్యాక్ చేసేటప్పుడు గోల్‌మాల్ జరుగుతోందని ఆరోపించారు. బరువును బట్టి సంచుల్లో రూపాయి నాణేలకు, రెండు రూపాయల నాణేలకు బదులుగా రూ. 5, రూ. 10 నాణేలను కూడా తరలించేస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీని వల్ల టీటీడీకి నష్టం కలుగుతోందన్నారు. అలాగే నాణేలను ప్యాక్‌చేసే గోతాములను గత 15 సంవత్సరాలుగా ఒక వ్యక్తి నుంచి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అలాగే టీటీడీ పరకామణిలో పేరుకుపోయిన కోట్ల రూపాయల చిల్లర నాణేలను సకాలంలో రిజర్వ్‌బ్యాంక్‌కు తరలించి ఉంటే వాటికి బదులుగా కరెన్సీ నోట్లు పొందివుండవచ్చని అన్నారు. అయితే టీటీడీ అధికారులు ఆపని చేయకపోవడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో కేలండర్లు, డైరీలు అందుబాటులో ఉంచినట్టుగా చిల్లర కూడా అందుబాటులో ఉంచితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. టీటీడీలో పేరుకుపోయిన కోట్ల రూపాయలు విలువైన నాణేలను కరిగించాలని టీటీడీ నిర్ణయించి మరో తప్పుడు నిర్ణయం తీసుకునిందన్నారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన నాణేలను ఎవరైనా కరిగించినా, నిర్వీర్యం చేసినా వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష తప్పదని 2009లో లోక్‌సభలో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కేబినెట్ బిల్లుకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ విషయం టీటీడీ అధికారులకు కనీసం తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. సకాలంలో స్పందించి శ్రీవారి హుండీకి నష్టం కలిగించే చర్యలను మానుకోవాలన్నారు.