రాష్ట్రీయం

పండ్ల తోటలపై ‘రియల్’ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 12: వివిధ రకాల పండ్ల జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉద్యాన తోటల భూములు కలిగిన గోదావరి జిల్లాల్లో ఉద్యాన తోటలు క్రమేణా క్షీణించి పోతున్నాయి. ప్రధానంగా తోటలు రియల్ ఎస్టేట్ల వేటుకు గురయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని చాగల్నాడు ప్రాంతం ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో వివిధ రకాల ఉద్యాన పంటలు విస్తృతంగా ఉన్నాయి. ఈ ప్రాంతం క్రమేణా రియల్ ఎస్టేట్లుగా మారడంతో అరుదైన వృక్ష జాతులు అంతరించి పోతున్నాయి. చాగల్నాడు ప్రాంతంగా పిలిచే ఈ ప్రాంతంలో విస్తారంగా ఉన్న నిమ్మ రాష్ట్రేతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజమహేంద్రవరం కేంద్రం గా నిమ్మ మార్కెట్ భారీ స్థాయిలో ప్రఖ్యాతి గాంచింది. సాధారణంగా ప్రతీ ఏడాది వేసవిలో నిమ్మ దిగుబడికి సీజన్‌గా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వర కు సీజన్ ఉంటుంది. ఈ ఏడాది దాదాపు నెల రోజులు ఆలస్యంగా సీజన్ మొదలైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం వల్ల దిగుబడి ఆలస్యమైంది. శ్రీరాంపురం, శ్రీకృష్ణపట్నం, రాధేయపాలెం, తుంగపా డు, తోకాడ, బూరుగుపూడి, నిడిగట్ల, నందరాడ, మధురపూడి, రాజానగరం, దివాన్ చెరువు, పాలచర్ల తదితర ప్రాంతాల్లో విస్తారంగా నిమ్మ సాగవుతోంది. తుంగపాడు, తోకాడ, రాధేయపాలెం, శ్రీకృష్ణపాలెం, దివాన్‌చెరువు, మధురపూడి, నందరాడ, బుచ్చయ్యనగర్, కవలగొయ్యి, పుణ్యక్షేత్రం తదితర ప్రాంతాల్లో భూములు రియల్ ఎస్టేట్లుగా మారుతున్నాయి. దీనికితోడు ఈ ప్రాంతంలో తోటలపై మక్కువ తగ్గిపోవడంతో కాపు కూడా తగ్గిపోయింది.
రాజమహేంద్రవరం నిమ్మ మార్కెట్ నుంచి రోజుకు నాలుగైదు లారీల నిమ్మకాయలు రాష్ట్రేతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. సీజన్‌లో నిత్యం సుమారు 60 టన్నుల నిమ్మ ఎగుమతి అవుతోంది. రైతులు తోటల నుంచి నిమ్మకాయలను బస్తాలతో ద్విచక్ర వాహనాలపై నిమ్మకాయల హోల్‌సేల్ వ్యాపార కేంద్రానికి తీసుకొస్తారు. అక్కడ వ్యాపారులు రైతులకు పది శాతం కమిషన్ తీసుకుని ధరలను నిర్ణయిస్తారు. ఈ మేరకు బస్తా నిమ్మ ధర హోల్‌సేల్‌గా రూ.3200 వరకు సరాసరిగా లభిస్తోంది. బయట మార్కెట్‌ను బట్టి రేటును నిర్ణయిస్తారు. హోల్‌సేల్ మార్కెట్‌లో పెద్ద, చిన్న రెండు సైజు ల్లో నిమ్మకాయలను గ్రేడింగ్ చేసి ఎగుమతి చేస్తుంటా రు. రైతులు తోట సంరక్షణను బట్టి దిగుబడులు అధికంగా వస్తాయి. రాజమహేంద్రవరం హోల్‌సేల్ నిమ్మ మార్కెట్ నుంచి కోల్‌కతా, టాటా, రాంచీ, భువనేశ్వర్, బరంపురం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలోని విశాఖ, ఇచ్చాపురం తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. రైతులకు, కమిషన్ వర్తకులకు మధ్య మధ్యవర్తులతో దిగుబడి మార్కెట్‌కు చేర్చుతారు.
రాష్ట్రంలో గూడూరు అతి పెద్ద నిమ్మ మార్కెట్‌గా ఉంది. పొదలకూరు, నెల్లూరు, తెనాలి, ఏలూరు, యాదోలు, జంగారెడ్డిగూడెం, రాజమహేంద్రవరం నిమ్మ మార్కెట్‌కు ప్రసిద్ధి. అయితే ఇందులో గూడూరు దేశంలోనే అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. రాష్ట్రంలో ఎన్ని మార్కెట్‌ల నుంచి ఉత్పత్తులు పెద్ద ఎత్తున జరుగుతు న్నా చాగల్నాడు నిమ్మకు మాత్రం మంచి గిరాకీ లభిస్తోంది. నిమ్మ మార్కెట్ గత ఏడాది ఆశాజనకంగా లేకపోయినా ఈ ఏడాది మాత్రం గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నిమ్మ రైతులకు లాభసాటి ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. మధ్యలో దళారులు లాభపడుతున్నారు.
జిల్లాలో సుమారు 30వేల ఎకరాల విస్తీర్ణంలో నిమ్మ తోటలు విస్తరించి ఉన్నాయి. రైతులు తోటల నుంచి నిమ్మకాయలకు మార్కెట్‌కు తీసుకురావాలంటే బస్తాకు రూ.100 ఖర్చు అవుతోందని రైతులు అంటున్నారు. మూడేళ్లుగా దళారులే నేరుగా రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి, వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలోని నిమ్మ తోటలో వారానికి 6వేల కాయల చొప్పున మార్చి నుంచి మే వరకు ఎకరానికి 1.20 లక్షల నిమ్మకాయలు దిగుబడి వస్తోందని అంచనా. దళారులు తక్కువకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన నిమ్మకాయలను నిమ్మ మార్కెట్‌లో మహిళా కూలీలు గ్రేడింగ్ చేసి ఎగుమతికి సిద్ధం చేస్తున్నారు.

చిత్రం... రియల్ ఎస్టేట్లుగా రూపాంతరం చెందుతున్న నిమ్మ తోటలు