రాష్ట్రీయం

శోభాయమానంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 13: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో సోమవారం శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 15వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు దశావతార మండపాన్ని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. అనంతరం స్వామివారికి కొలువు జరిగింది. ఈ కొలువులో సర్వజగత్ప్రభువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, నృత్యాలు నివేదించారు. పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి, భూదేవీ సహితుడైన స్వామి బంగారు తిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయంలో ప్రవేశించడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఈసందర్భంగా ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ వైశాఖశుద్ద దశమి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆకాశరాజు తన కుమార్తె శ్రీ పద్మావతి దేవిని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఇచ్చి వివాహం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. శ్రీ మలయప్ప స్వామివారు తొలిరోజు గజవాహనంపైన, రెండోరోజు అశ్వవాహనంపైన చివరి రోజు గరుడవాహనంపైన వేంచేపు చేస్తారని, మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారని, ఆ తరువాత కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్ లోకనాథం, ఆలయ ఓఎస్డీ పాలశేషాద్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.