రాష్ట్రీయం

టెన్త్‌లో బాలికలే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 14: గత ఏడాది పదవ తరగతి ఫలితాలతో పోలిస్తే ఈ ఏడాది 0.4 శాతం ఫలితాలు మెరుగయ్యాయి. మంగళవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో కమిషనర్ సంధ్యారాణి, డైరెక్టర్ సుబ్బారెడ్డి పదవతరగతి ఫలితాల సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఫలితాలు వివరాలను పాత్రికేయులకు వివరించారు. పరీక్షలకు 6,32,898 మంది నమోదు చేసుకోగా 6,30,082 మంది హాజరయ్యారన్నారు. వారిలో రెగ్యులర్ 6,19,494 మంది, ప్రైవేట్ అభ్యర్ధులు 10,588 మంది ఉన్నారని తెలిపారు. రెగ్యులర్ విద్యార్ధుల్లో 94.88శాతం ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరిలో బాలురు 94.68 శాతం, బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణులయ్యారని అదే విధంగా ప్రైవేట్ అభ్యర్ధుల్లో 58.82 శాతం ఉత్తీర్ణులు కాగా వారిలో బాలురు 56.72 శాతం, బాలికలు 61.84 శాతం ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఈ ఏడాది 5464 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణులయ్యారని, మూడు పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా 98.19 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచిందని, 83.19శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు చివరిస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు 98.24 శాతం అత్యధిక ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలువగా ఎయిడెడ్ పాఠశాలలు 87.16 శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచాయి. సబ్జెక్టుల వారీగా చూస్తే గత ఏడాది ఫస్ట్ లాంగ్వేజ్‌లో 99.47 శాతం పాస్ కాగా ఈ ఏడాది 99.42 శాతం, సెకండ్ లాంగ్వేజ్‌లో గత ఏడాది 99.98 శాతం పాస్ కాగా ఈఏడాది 99.98 శాతం, థర్డ్ లాంగ్వేజ్‌లో గత ఏడాది 99.68 పాస్ కాగా ఈ ఏడాది 99.7 శాతం, గణితంలో గత ఏడాది 96.45 శాతం పాస్ కాగా ఈ ఏడాది 96.25 శాతం, సామాన్యశాస్త్రంలో గత ఏడాది 97.30 శాతం పాస్ కాగా ఈ ఏడాది 98.21 శాతం, సాంఘిక శాస్త్రంలో గత ఏడాది 99.84 శాతం పాస్ కాగా ఈ ఏడాది 99.84 శాతం పాసయ్యారు. జిల్లాల వారీగా చూస్తే 98.19 శాతంతో తూర్పుగోదావరి అగ్రస్థానంలో నిలువగా తరువాతి స్థానాల్లో ప్రకాశం 98.17శాతం, చిత్తూరు 97.41 శాతం, విజయనగరం 97.28 శాతం, విశాఖపట్నం 96.37 శాతం, శ్రీకాకుళం 95.58 శాతం, అనంతపూర్ 95.55 శాతం, గుంటూరు 95.35 శాతం, కృష్ణా 93.96 శాతం, పశ్చిమగోదావరి 93.29 శాతం, వైఎస్‌ఆర్ కడప 92.90 శాతం, కర్నూల్ 92.10 శాతం, నెల్లూరు 83.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదికి పది జీపీఏలో సైతం తూర్పుగోదావరి జిల్లా ప్రధమస్థానంలో నిలువగా నెల్లూరు చివరి స్థానంలో నిలిచింది.
కేజీబీవీ విద్యార్థినుల ప్రతిభ
పదవ తరగతి ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థినులు 95.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని మొత్తం 352 కేజీబీవీల్లో పరీక్ష రాసిన విద్యార్థినులు 12,823 మంది కాగా 12,266 మంది ఉత్తీర్ణత సాధించారని సమగ్రశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారి జి శ్రీనివాస్ తెలిపారు. వందశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు 188 ఉండగా పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థినులు 161 మంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాల్లో ఐదవస్థానం కైవసం చేసుకున్నారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధినులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో 31 కేజీబీవీల్లో ఇంటర్మీడియేట్ విద్యను ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. పదవతరగతి ఉత్తీర్ణురాలైన ప్రతి అమ్మాయి ఇంటర్మీడియేట్ చదవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అనుమతితో మరో 140 కేజీబీవీల్లో ఇంటర్మీడియేట్ విద్యను ప్రవేశ పెట్టనున్నట్లు శ్రీనివాస్ వివరించారు.
జూన్ 17నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ
ఏపీ పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 17 నుండి నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ సుబ్బారెడ్డి తెలిపారు. జూన్ 6వతేదీ లోపు విద్యార్థి పరీక్ష ఫీజును చెల్లించాలన్నారు. మూడు అంతకన్నా తక్కువ సబ్జెక్టులు ఉంటే రూ.110, మూడు కన్నా ఎక్కువ సబ్జెక్టులు ఉంటే రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. జూన్ 17వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1, 18వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2, 19వ తేదీ సెంకడ్ లాంగ్వేజ్ (హిందీ), 20వ తేదీ ఇంగ్లీష్ పేపర్-1, 21వ తేదీ ఇంగ్లీష్ పేపర్-2, 22వ తేదీ మాథమ్యాటిక్స్ పేపర్-1, 24వ తేదీ మాథమ్యాటిక్స్ పేపర్-2, 25వ తేదీ జనరల్ సైన్స్ పేపర్-1, 26వ తేదీ జనరల్ సైన్స్ పేపర్-2, 27వ తేదీ సోషల్ పేపర్-1, 28వ తేదీ సోషల్ పేపర్-2, 29వ తేదీ ఓఎస్‌ఎస్‌సీ మొయిన్ లాంగ్వేజ్ పేపర్-2 జరుగుతాయని తెలిపారు.

చిత్రం...పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తున్న పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి, తదితరులు