రాష్ట్రీయం

పరిషత్ పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జడ్పీటీసీ, ఎంపీటీసీలకు మంగళవారం జరిగిన పోలింగ్‌లో 77.81 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు ప్రకటించారు. తెలంగాణలోని 27 జిల్లాల్లో తుదిదశలో మంగళవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మిగతా ఐదు జిల్లాల్లో మొదటి రెండుదశల్లోనే పోలింగ్ పూర్తయింది. తొలిదశ, రెండోదశలలో కూడా 77 శాతం ఓట్లు పోల్‌కావడం గమనార్హం. మంగళవారం జరిగిన పోలింగ్‌లో 46,49,584 మంది ఓటర్లు ఓటు హక్కు కలిగి ఉండగా, వీరిలో 36,17,961 మంది తమ ఓటుహక్కును ఉపయోగించుకున్నారు. మరో 10 లక్షల మంది ఓటుహక్కును వినియోగించుకోలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 88.40 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. నల్లగొండ 88.50, సూర్యాపేట 85.04 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం మీద పరిశీలిస్తే నల్లగొండ పాత జిల్లా రాష్ట్రం మొత్తంలో ఓట్లు వేయడంలో చైతన్యవంతంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. అతితక్కువగా పోల్ అయిన జిల్లాల్లో నారాయణపేట నిలుస్తోంది. ఈ జిల్లాలో 68.53 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. తక్కువ శాతం ఓట్లు పోలైన జిల్లాల్లో
వికారాబాద్ (70.85 శాతం), నిజామాబాద్ (72.01 శాతం) నిలిచాయి. 27 జిల్లాల్లోని 161 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగగా 741 మంది పోటీ పడ్డారు. అలాగే 1,738 ఎంపీటీసీ స్థానాలకు 5,726 మంది పోటీ పడ్డారు. కౌంటింగ్ ఈ నెల 27 న నిర్వహిస్తారు.
చిత్రం...సిరిసిల్ల జిల్లాలో ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళలు