రాష్ట్రీయం

పెరగనున్న ఉష్ణోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతల తీవ్రత ఉండవచ్చని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం మంగళవారం రాత్రి పేర్కొంది. వాతావరణ చల్లబడేందుకు మరికాస్త సమయం పట్టనుందని ఈ కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి ఎక్కడా వాతావరణంలో మార్పు లేదని కేంద్రం వివరించింది. ఏపీలో సాధారణ ఉష్ణోగ్రతలుండగా, మధ్యలో ఒకటి రెండు డిగ్రీల మేర పెరగవచ్చని, జూన్ తొలి వారంలో మాత్రం 40 డిగ్రీలు దాటి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నట్టు ఈ కేంద్రం తెలియజేసింది. రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం, పర్యావరణం దెబ్బతింటున్న పరిస్థితుల వల్లే ఎండల తీవ్రతకు ప్రధాన కారణాలుగా కేంద్రం పేర్కొంది. గాలిలో కాలుష్య కారకాలు చేరి వేడి విపరీతంగా ఉద్భవిస్తోందని, దీని వల్లే గత ఏడాది జూన్ మొదటి వారంలో 45 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరిందని కేంద్రం తెలియజేసింది. వేసవి సీజన్‌లో ఏపీలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలనేవి సాధారణమైపోయాయని, జూన్ తొలివారం ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడిన సందర్భంలో ఉరుములు, మెరుపులు గాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించింది. మండుతున్న ఎండలనుబట్టి ఇటువంటి పరిస్థితులు సాధారణంగా సాయంత్రం సమయాల్లో ఏర్పడుతుంటాయని కేంద్రం తెలిపింది. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడానికి సమయం పట్టవచ్చని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది.