రాష్ట్రీయం

ఐదు కేంద్రాల్లో 19న రీపోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో మరో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణపై ప్రధాన పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ మేరకు గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ఈ నెల 6న రీపోలింగ్ నిర్వహించారు. కాగా ఎన్నికల నాటినుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పరస్పరం రీపోలింగ్‌కు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు ఈ విషయమై ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. ఈసీ విచారణ జరిపిన అనంతరం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్నార్ కమ్మపల్లిలోని 321 కేంద్రం, పులివర్తిపల్లిలోని 104 పోలింగ్ కేంద్రం, కొత్త కండ్రిగలోని 316 పోలింగ్ కేంద్రం, కమ్మపల్లిలోని 318, వెంకట్రామపురంలోని 313 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 19న ఈ ఐదు కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల రోజు నియోజకవర్గంలో జరిగిన సంఘటనలను విచారించిన అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇరువురు నియోజకవర్గం పరిధిలోని పలుచోట్ల అక్రమాలు జరిగాయని రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో 19న దేశవ్యాప్తంగా తుది విడత ఎన్నికల రోజున ఈ ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.