రాష్ట్రీయం

విన్నపాలు వినవలె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మే 16: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీగా వైకాపా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా గురువారం రెండవ రోజు పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. క్యాంప్ కార్యాలయానికి భారీగా జనం తరలిరావడంతో ప్రతి ఒక్కరినీ కలవాలన్న ఉద్దేశ్యంతో జగన్ నిలుచునే ఓపిగ్గా అందరితో మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు. వైకాపాకు చెందిన పలువురు నాయకుల వివాహ వేడుకలకు వెళ్లాల్సి ఉన్నా రద్దు చేసుకుని ప్రజలతో గడిపారు. జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న అనంతపురం నుంచి నాయకులు పెద్దసంఖ్యలో జగన్‌ను కలిసేందుకు వచ్చారు. తాడిపత్రి వైకాపా అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి జగన్‌ను కలిసి ఎన్నికల సమయంలో తాడిపత్రిలో జరిగిన పరిణామాలు, ఓటింగ్ సరళిని జగన్‌కు వివరించారు. కౌంటింగ్ రోజున నాయకులంతా అప్రమత్తంగా ఉండి, ప్రత్యర్థులకు ఎటువంటి అవకాశమివ్వకుండా జాగ్రత్తపడాలని జగన్ వారికి సూచించారు. పలువురు తాత్కాలిక ఉద్యోగులు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వైకాపాకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు, ఓటింగ్ సరళిని జగన్‌కు తెలియజేశారు. సాయంత్రం ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు జగన్ కడపకు బయలుదేరి వెళ్లారు. విందు ముగించుకుని తిరిగి పులివెందులకు వచ్చి క్యాంప్ కార్యాలయంలో రాత్రి వరకు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం జగన్ హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. జగన్‌ను కలిసిన వారిలో కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్.అవినాష్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పులివెందుల వైకాపా నేత నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, మండల కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

చిత్రం...పులివెందులలోని క్యాంపు కార్యాలయం ఎదుట జగన్‌ను
కలిసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు