రాష్ట్రీయం

ఇద్దరి ఫ్రంట్ల టెంట్లు లేచిపోవడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం దాటికి ఇద్దరు చంద్రుల ఫ్రంట్ల టెంట్లు లేచిపోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఈ నెల 23న ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాలకు పట్టిన చంద్రగ్రహణాలు వీడనున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు చంద్రుల్లో ఒకాయన (కేసీఆర్) అడవి బాట పడితే, మరొకాయన (చంద్రబాబు) ఢిల్లీ, కోల్‌కత్తాల చుట్టు ప్రదక్షిణాలు చేస్తున్నారని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతాడని, కేసీఆర్ బొంగరం తిప్పుతాడని వంత పాడుతున్నాయని విమర్శించారు. తమ దృష్టిలో టీఆర్‌ఎస్, టీడీపీలు దొందు...దొందేనన్నారు. కాంగ్రెస్, బీజేపేతర ప్రభుత్వాలంటూనే బయటి నుంచి కాంగ్రెస్‌కు కేసీఆర్ మద్దతు అంటున్నారని విమర్శించారు. కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులు పెట్టుకోవడాన్ని ప్రజలు ఒప్పుకోరని లక్ష్మణ్ విమర్శించారు. ఓటమికి చంద్రబాబు ముందుగానే సాకులు వెతుకుంటున్నాడని లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని అంటూనే మళ్లీ తానే గెలుస్తానని చంద్రబాబు పరస్పరం విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న నాయకులు మరికొందరు బీజేపీలోకి రాబోతున్నారని లక్ష్మణ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ మాదిరిగానే తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం కూడా భవిష్యత్‌లో మార్పు కోరుకుంటుందన్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాబోతుందన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వ పనితీరు...అవినీతిరహిత పాలనకు దేశ ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సాహోసోపేత నిర్ణయాలకు ప్రజలు మోదీకి నీరాజనాలు పలుకుతున్నారన్నారు. ప్రజలు అమాయకులు కారని, ప్రతిపక్షాలకు సమయం చూసి కర్రుకాల్చి వాత పెట్టబోతున్నారని దుయ్యబట్టారు. ఎవరి మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో బీజేపీ స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

చిత్రం... బీజేపీ రాష్టన్రాయకుల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.
డీకే అరుణ, మురళీధరరావు ఫొటోలో ఉన్నారు