రాష్ట్రీయం

తొలి రాష్ట్రపతి గా దళితుడ్ని నియమించాలనుకున్న గాంధీజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 22: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లల్లో ఈ దేశానికి నిరక్షరాస్యుడు, దళితుడు అయిన చక్రయ్యను రాష్ట్రపతి ని చేయాలని మహాత్మాగాంధీ కలలు కన్నారని గాంధీ మనవడు గోపాలక్రిష్ణ గాంధీ వెల్లడించారు. మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతా మోహన్ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలోని గాంధీట్రస్ట్ భవన్‌లో నిరుపేదల అప్పులు - అధిక వడ్డీలు అనే అంశంపై జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా మహాత్ముని విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం గోపాలక్రిష్ణ గాంధీ మాట్లాడుతూ మహాత్మాగాంధీ తన స్వహస్తాలతో రాసుకున్న అంశాల్లో ఒక దళితుడు, నిరక్షరాస్యుడైన చక్రయ్యను భారతదేశానికి తొలి రాష్ట్రపతి చేయాలని భావించారన్నారు. అయితే చక్రయ్య అకాల మరణం గాంధీని ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. తాను అతనికి ఎంతో చేయాలని భావించానని, కాని ఆయన అకాలమరణంతో ఏమీ చేయలేకపోయానని ఆవేదన చెందారని తెలిపారు. దళితులపై గాంధీకున్న ప్రేమ, అభిమానాలకు ఇది నిదర్శమని చెప్పారు. ఆ తరువాత కేరళ రాష్ట్రానికి చెందిన కే.ఆర్.నారాయణన్ రాష్ట్రపతి కావడంతో మహాత్ముని కల సాకారమైందన్నారు. గాంధీజీ భారత్‌లో పుట్టినా సౌత్ ఆఫ్రికాలోనే పూర్ణత్వం సాధించారన్నారు. అక్కడున్న ఆంధ్ర, తమిళ కూలీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాధాన్యత కోసం తొలి సత్యాగ్రహాన్ని గాంధీజీ చేశారన్నారు. ఆ తరువాత భారతదేశానికి వచ్చి దేశ స్వాతంత్య్రం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలను చేశారన్నారు. సౌత్ ఆఫ్రికా నల్ల సూరీడుగా పేరుగాంచిన నెల్సన్ మండేలా మహాత్ముడు చూపిన బాటలో ఉద్యమాలను కొనసాగించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే గాంధీజీకి ఎంతో ఇష్టమన్నారు. తాను గాంధీజీ మనవడిని అయినా ఆయన్ను ప్రేమించే, అభిమానించే, అనుసరించేవారంతా ఆయన వారసులేనని ఆయన పేర్కొన్నారు. భారత్ భవిష్యత్ పట్టణాలపై ఉందన్న విషయాన్ని పాలకులు గుర్తించాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉందని, ఇందుకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఆర్బీఐ మాజీ గవర్నర్లు రంగరాజన్, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, రఘురామరాజు ఒక కమిటీ ఏర్పడి ఒక నివేదికను తయారు చేసి, పరిష్కారాలను చూపాల్సి ఉందని గోపాలక్రిష్ణ గాంధీ పేర్కొన్నారు. అప్పులు, అధిక వడ్డీల ఊబిలో మహిళలు చిక్కుపోతున్న విషయం ఆందోళన కలిగిస్తోందన్నారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోపాలక్రిష్ణ గాంధీ సతీమణి తారాగాంధీ, ఏఐసీసీ సభ్యురాలు ప్రమీలమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూతలపట్టు ప్రభాకర్, సావిత్రి యాదవ్, శాంతి యాదవ్, తేజోవతి తదితరులు పాల్గొన్నారు.