రాష్ట్రీయం

భగత్ మాటల వక్రీకరణా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 11: తెల్లదొరల దాష్టీకానికి బలైన భగత్‌సింగ్ ఉరికంబం ఎక్కే ముందు భారత్ మాతాకీ జై అంటూ నినదించారని, దీనికి లౌకికవాదులుగా చెప్పుకుంటున్న కొంతమంది వక్రభాష్యం చెపుతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. విశాఖపట్నంలో సోమవారం జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంత్యుత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భగత్‌సింగ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించే కమ్యూనిస్టులు ఆయన చివరి మాటలను వక్రీకరించి, ఇన్‌క్విలాబ్ జిందాబాద్ అంటూ తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. భారత్ మాతాకీ జై అంటే అది మట్టికిచ్చే విలువ కాదని, భారతదేశంలో కోట్లాది మంది జనాలకిచ్చే గౌరవంగా భావించాలన్నారు. లౌకికవాదం ముసుగులో కొన్ని రాజకీయపార్టీలు ప్రతి చిన్న అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయని, ఇది ఎక్కడకు దారితీస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలుగా భావించే విద్యాలయాల్లోనూ రాజకీయాలు జొప్పించి, అమాయక విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. గత ఐదారు దశాబ్దాలుగా కులం, మతం పేరిట రాజకీయాలు చేసి, ఆయా వర్గాలను ఓటు బ్యాంకుగా మార్చుకున్న పార్టీలు ఇప్పుడు కొత్త వివాదాలను తెరపైకి తెస్తూ వివాదాలు సృష్టిస్తున్నాయన్నారు. దేశంలో 740 విశ్వవిద్యాలయాలు ఉండగా, కేవలం కొన్నింటిలో మాత్రమే ఇటువంటి వివాదాస్పద అంశాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే కనీసం స్పందించని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఒక విద్యార్థి ఆత్మహత్యను రాజకీయ లబ్ధికోసం వాడుకున్నారని మండిపడ్డారు.
మోదీ అంటే ...
మోదీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అంటూ వెంకయ్య కొత్త నిర్వచనాన్నిచ్చారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రధాని తీసుకున్న అమోఘమైన చర్యలు అన్నీఇన్నీ కావన్నారు. దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాని చేపడుతున్న సంస్కరణలు తమకు అధికారాన్ని ఎక్కడ దూరం చేస్తాయోనని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయన్నారు.

చిత్రం విశాఖపట్నంలో సోమవారం జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంత్యుత్సవంలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు