రాష్ట్రీయం

మూడు గంటలు ఏకధాటిగా పాఠం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: యూనివర్సిటీలో ప్రొఫెసర్లు గంట పాటు పాఠం చెబుతారు, పాఠశాలల్లో పంతుళ్లు 40-50 నిమిషాల పాటు క్లాస్ తీసుకుంటారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు మూడు గంటల పాటు రాజకీయాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, ప్రజల సమస్యలు, ఆ సమస్యలను తీర్చడానికి ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సిన తీరు, ప్రపంచ వ్యాప్తంగా సుందరమైన నగరాలు.. ఒకటేమిటి గల్లీలోని సమస్యలు మొదలుకొని అంతర్జాతీయ అంశాల వరకు అనర్ఘళంగా పాఠం చెప్పారు. హైదరాబాద్ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లకు మూడు రోజుల శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభం అయింది. నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ కూడా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అది నిజంగా ప్రజాప్రతినిధులకు పాఠమే. మధ్య మధ్యలో తాను ప్రస్తావించిన అంశాల్లో నోట్ చేసుకోవలసిన పాయింట్లు ఏమిటో కూడా సిఎం వివరించారు. నోట్ చేసుకోవడం లేదని మధ్య మధ్యలో అడిగారు. కార్పొరేటర్లే కాదు మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సైతం ముఖ్యమంత్రి చెప్పిన అంశాలను సీరియస్‌గా రాసుకున్నారు. గతంలో హైదరాబాద్ ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? హైదరాబాద్ ఎలా ఉండాలని అనుకుంటున్నావు? ఈ మూడు ప్రశ్నలను రాసుకోండి, వీటికి సమాధానం లభిస్తే, హైదరాబాద్ స్వరూపం మారిపోతుందని అన్నారు. మూడు గంటల పాఠాన్ని ముఖ్యమంత్రి ఎలాంటి నోట్స్ చూడకుండా అంకెలతో సహా చెప్పుకుంటూ పోయారు. మధ్య మధ్యలో జీవిత అనుభవాలను, శాసనసభ్యునిగా ఎన్నికైన తరువాత ఎదురైన పలు అంశాలను వివరించారు. తొలిసారిగా 1985లో శాసనసభ్యునిగా ఎన్నికైన తరువాత పంచాయతీ సమితి సమావేశానికి వెళితే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఏవేవో చెబుతుంటే తనకేమీ అర్థం కాలేదని కెసిఆర్ తెలిపారు. అక్కడ చెబుతున్న అంశాలు తనకేమీ అర్థం కాకపోవడంతో అవమానంగా భావించానని, పైకి గంభీరంగానే ఉన్నా, ఆత్మన్యూనతా భావానికి గురైనట్టు చెప్పారు. తర్వాత సమితి అభివృద్ధి అధికారిని తనకు పంచాయతీరాజ్ శాఖ గురించి వివరించాలని కోరానని, అతని ఇంటికి వెళ్లి మూడు రోజుల పాటు శిక్షణ పొందినట్టు చెప్పారు. మరింత శిక్షణ కోసం రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థలో వారం రోజుల పాటు శిక్షణ పొందినట్టు చెప్పారు. అనంతరం జిల్లా అధికారులందరికీ లేఖ రాసి వారి శాఖకు సంబంధించి తన నియోజక వర్గంలో తానేమి చేయవచ్చునో వివరించమని కోరినట్టు చెప్పారు. అన్ని అంశాలపై అవగాహన ఉంటేనే ప్రజలకు సేవ చేయగలం అని అన్నారు.రియో నగరం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన అందమైన నగరంగా నిలిచిందని ఆ నగరం వాళ్లు ఏం చేశారో ఇంటర్‌నెట్‌లో చూడాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అన్ని నగరాల మాదిరిగానే రియో నగరం ఉండేదని, కొంత మంది విద్యావంతులు అన్ని నగరాల్లో మాదిరిగానే పాలకులను తిట్టుకున్నారని, తరువాత మనం ఏమీ చేయలేమా? అని ఆలోచించారని చెప్పారు. తమను గెలిపిస్తే నగరాన్ని అద్భుతంగా మారుస్తామని ప్రజలకు చెపితే గెలిపించారని, చెప్పినట్టు చేసి చూపించారని అన్నారు. రియో నగరంలో రోడ్లను ఇప్పటికీ రోజుకు రెండు సార్లు కడుగుతారని ముఖ్యమంత్రి చెప్పారు.
చెట్ల పెంపకం ఆవశ్యకతను వివరిస్తూ ఏ దేశంలో ఎన్ని చెట్లు ఉన్నాయో వివరించారు. కెనడాలో ఒక వ్యక్తికి 8953 చెట్లు ఉంటే రష్యాలో 4461, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉన్నాయని, ఇక ఇండియాలో మాత్రం ఒక్క వ్యక్తికి 28 చెట్ల చొప్పున ఉన్నాయని తెలిపారు. శిక్షణ శిబిరం నిర్వహించిన ప్రగతి రిసార్ట్స్‌లో ఒక్కో వ్యక్తికి సగటున ఐదువేల చెట్లు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.