రాష్ట్రీయం

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో భారీగా ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వివిధ జిల్లాల కలెక్టర్లు సహా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం మూడు జీవోలను జారీ చేసింది. ఇప్పటి వరకూ వివిధ శాఖల్లో కీలక స్థానాల్లో ఉన్న వారిని అంతగా ప్రాధాన్యత లేని శాఖలకు బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్లను ఇతర శాఖలకు బదిలీ చేయడమే కాకుండా కొత్తగా కొంతమందిని కలెక్టర్లుగా నియమించింది. చాలా మందికి తదుపరి పోస్టింగ్‌లు ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్‌ను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎంపీ కాంతిలాల్ దండేను ఇంటర్మీడియట్ విద్య కమిషనర్‌గా, ఏపీ ఎస్సీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ విజయ్‌కుమార్‌ను పురపాలక శాఖ కమిషనర్‌గా నియమించింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న కన్నబాబును సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టు చేయమని ఆదేశించింది. విజయకుమార్‌కు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న గిరిజా శంకర్‌ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా నియమించి, ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న రంజిత్ బాషాను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. జీఏడీలో కార్యదర్శి పి.లక్ష్మీనరసింహంను
సీఆర్‌డీఏ కమిషనర్‌గా, ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న చెరుకూరి శ్రీ్ధర్‌ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను శాప్ ఎండీగా, ఇప్పటి వరకూ అక్కడ ఉన్న ఎంవి శేషగిరి బాబును నెల్లూరు జిల్లా కలెక్టరుగా నియమించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్‌గా, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎంఎం నాయక్‌ను ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా, ఉన్నత విద్య డిప్యూటీ సెక్రటరీ హర్షవర్థన్‌ను సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌గా, సహకార శాఖ స్పెషల్ కమిషనర్ మురళీని సీఎం ఓఎస్డీగా, ఏపీ టూరిజం అథారిటీ సీఈవో కె.విజయను సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా నియమించి, ఇప్పటి వరకూ అక్కడ ఉన్న సాగిలి షణ్మోహన్‌ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పి.సీతారామాంజనేయులను రవాణా శాఖ కమిషనర్‌గా, ఉద్యాన శాఖ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి చిరంజీవి చౌదరిని ఆదే శాఖ కమిషనర్‌గా నియమించింది.
మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్‌ను గుంటూరు జిల్లా కలెక్టరుగా, సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్ పి.భాస్కరను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ డి.మురళీధర్ రెడ్డిని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా, ఇప్పటి వరకూ కలెక్టర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రాను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణను అనంతపురం జిల్లా కలెక్టర్‌గా, ఇప్పటి వరకూ అక్కడ ఉన్న వీరపాండ్యన్‌ను కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా రేవు ముత్యాల రాజును, విశాఖ జిల్లా కలెక్టర్‌గా వి.వినయ్ చంద్‌ను, పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ నారాయణ భరత్ గుప్తాను చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జె.ఎస్.వెంకటేశ్వర ప్రసాద్‌ను ఉన్నత విద్యకు, రహదారులు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కార్మిక శాఖకు, పాఠశాల విద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాథ్ దాస్‌ను జలవనరుల శాఖకు పంపించి, అక్కడ పని చేస్తున్న శశిభూషణ్‌కుమార్‌ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్యను వ్యవసాయ శాఖకు, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్‌ను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు పంపించి, అక్కడ పని చేస్తున్న ఉదయలక్ష్మిని జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రజత భార్గవను పరిశ్రమల శాఖకు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.జవహర్ రెడ్డిని వైద్య, ఆరోగ్య శాఖకు, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జి.అనంత రామును, జీఏడీలో ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ప్రవీణ్‌కుమార్‌ను యువజన, సాంస్కృతిక శాఖకు, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌పి సిసోడియాను జీఏడీకి, అక్కడ ఉన్న నాగులాపల్లి శ్రీకాంత్‌ను ఏపీ ట్రాన్స్‌కో సీఎండీగా, ఏపీజెన్‌కో సీఎండీ విజయానంద్‌ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. బుడితి రాజశేఖర్‌ను పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీగా, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎం.టి కృష్ణబాబును రహదారులు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఉన్నత విద్య స్పెషల్ కమిషనర్ కె.దమయంతిని మహిళా శిశు సంక్షేమ శాఖకు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావును పురపాలక శాఖ కార్యదర్శిగా, ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంకె మీనాను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించింది. గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలను కూడా అప్పగించింది. ఏహెచ్‌డిడి శాఖ సెక్రటరీ బి.శ్రీ్ధర్‌ను ఏపీజెన్‌కో సీఎండీగా, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, అక్కడ ఉన్న డి.వరప్రసాద్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మార్క్‌ఫెడ్ ఎండీ వై.మధుసూదన రెడ్డిని వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించింది.