రాష్ట్రీయం

రీజనల్ రింగ్ రోడ్డుకు 12 వేల ఎకరాల భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వం పావులను చకాచకా కదుపుతోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులపై త్వరలో రాష్ట్ర అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది. కేంద్రంలో రెండవసారి కూడా రవాణాశాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ నియమితులు కావడం, ఈ ప్రాజెక్టుగురించి సమగ్రమైన అవగాహన కలిగి ఉండడం రాష్ట్రప్రభుత్వానికి వరంగా పరిణమించింది. 330 కి.మీ పొడువున ఉంటే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి దాదాపు 12వేల ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. భూమి సేకరణ నిమిత్తం దాదాపు రూ.4వేల కోట్లు అవసరమని అంచనావేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దాదాపు రూ.13 వేల కోట్ల వ్యయమవుతుంది. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్రం ఇప్పటకే సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. కనీసం వంద మీటర్ల వెడల్పు రోడ్డు ఉండాలంటున్నారు. దీని వల్ల ఎక్కువ మొత్తంలో భూమిని సేకరించాల్సి ఉంటుంది. భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, శంకరపల్లి, తూప్రాన్, నర్సాపూర్, గజ్వేల్ తదితర పట్టణాల శివార్ల ద్వారా రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామాలు, పట్టణాలకు మహర్దశ పట్టనుంది. జాతీయ రహదారుల నుంచి ప్రతిపాదిత రీజనల్ రోడ్డుకు రోడ్లను అనుసంధానం చేయనున్నారు. మొదట అధికారులు వెళ్లి కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయమై చర్చలు జరపనున్నారు.