ఆంధ్రప్రదేశ్‌

అమెరికా సంస్థల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12:రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాల కారణంగా తక్షణం నవ్యాంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో 50 విదేశీ ఐటి కంపెనీల యాజమాన్యాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. దీనిపై సిఎం స్పందిస్తూ ఆయా కంపెనీల ప్రతినిధులు కోరిన ప్రకారం ప్లగ్ అండ్ ప్లే రెంటల్ స్పేస్‌ను రాయితీగా ఇవ్వడానికి, పాక్షికంగా శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచడానికి అంగీకరించారు. ఎన్నారై సేవలు, పెట్టుబడుల సలహాదారు రవికుమార్ వేమూరు, సిఎం కార్యాలయ కార్యదర్శులు సాయిప్రసాద్, ప్రద్యుమ్నతో కలిసి ముఖ్యమంత్రి ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటికే 400 పైగా అమెరికన్ ఎన్నారై ఐటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఐటి సర్వే పేరుతో ఒక కన్సార్టియంగా ఏర్పడ్డాయి. వీటిలో పలు కంపెనీలు ఐటి సంబంధిత రంగాల్లో బహుళ నైపుణ్యం, విద్య, ఐఓటి, క్లేడ్ మేనేజ్‌మెంట్, యాప్ డెవలప్‌మెంట్ తదితర రంగాల్లో సేవలందించటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. డల్లాస్, చికాగో, న్యూజెర్సీ, హేస్టన్, అట్లాంటా, వాషింగ్టన్ డిసి తదితర ప్రాంతాలకు చెందిన 100కు పైగా కంపెనీల ప్రతినిధులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఐటి సర్వే సభ్యుల కోరిక మేరకు స్థానికులకు ఐటి ట్రైనింగ్ ఇచ్చే కంపెనీలకు కూడా ఐటి కంపెనీలతో సమానంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని సిఎం నిర్ణయించారు. అమెరికన్ ఐటి కంపెనీలు స్థానికంగా పనిచేయడానికి పూర్తి స్థాయి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయగలమన్నారు. ఐటి సర్వే సభ్యులు కోరిన విధంగా 99 సంవత్సరాల భూమి లీజుపై సర్వీస్ టాక్స్ వంటివి కల్పించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని చంద్రబాబు ఆయా కంపెనీలకు హామీ ఇచ్చారు.

చిత్రం... వివిధ దేశాల ఐటి కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో
మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు