రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బలమైన పార్టీగా అవతరించేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రానున్న రోజుల్లో మూడు పార్టీల మధ్య పోరు రసకందాయంగా ఉంటుందని చెప్పవచ్చు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు సీట్లు, కాంగ్రెస్‌కు మూడు సీట్లు వచ్చాయి. ఈ ఫలితాలను చూసిన బీజేపీ సంతోషానికి అవధులు లేకుండాపోయింది. గెలిస్తే సికింద్రాబాద్ లేదంటే ఎక్కడా ఏమీ లేనట్లేనన్న చిరు ఆశతో బీజేపీ ఉండేది. కాగా మోదీ ప్రభంజనం దెబ్బకు నాలుగు స్థానాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు చిత్తుగా ఓటమి చెందాయి. ఒక్క సీటులో కూడా గెలుస్తామన్న ఆశలేన కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా బీజేపీని విస్తరించాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీలోకి ఇతర పార్టీలకు చెందిన సీనియర్లను ఆహ్వానించారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే రెండేళ్లలో బీజేపీలో చాలా మంది ప్రముఖులు చేరే అవకాశం కనపడుతోంది. బీజేపీ గతంలో అనుసరించిన విధానాలకు స్వస్తి చెప్పి ఉద్యమబాటను ఎంచుకుంది. ఇందులో భాగంగా ఇంటర్ బోర్డు వైఫల్యం వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే పెద్ద ఉద్యమాన్ని బీజేపీ నడిపింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన రీతిలో చురుకుగా వ్యవహరించలేదు.
బీజేపీకి అదృష్టవశాత్తు 4 సీట్లు వచ్చాయని, బీజేపీకి అంత సీను లేదని, ఈ రాష్ట్రంలో బలపడని, మోదీ ప్రభావం, కాంగ్రెస్ అభ్యర్థుల తీరు వల్ల బీజేపీ గెలిచి ఉండవచ్చని ఒక ప్రెస్‌మీట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది.కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యల్లో పసలేదని, చాలా మంది పార్టీ నేతలు కాంగ్రెస్‌ను వీడనున్నారని, బీజేపీని బలోపతం చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీకి సంస్థాగతంగా బలం లేదని, కేవలం మోదీ ఊపులో బీజేపీ గెలిచిందన్నారు. ఈ మాటలను బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. నాలుగు లోక్‌సభ సీట్లతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నేతలు టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. టీఆర్‌ఎస్‌ను మట్టికరిపించే శక్తితమకు మాత్రమే ఉందని, ఆ పార్టీకి ఢీ కొనే సత్తా తమకే ఉందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇప్పటికే ప్రకటించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 47.4 శాతం ఓట్లు, 88 సీట్లు, కాంగ్రెస్‌క 19 సీట్లు, 28.7 శాతం ఓట్లు, టీడీపీకి రెండు సీట్లు, 3.5 శాతం ఓట్లు, ఎంఐఎంకు 2.7శాతం ఓట్లు, 7 సీట్లు వచ్చాయి. బీజేపీకి ఒక సీటు మాత్రమే వచ్చింది. పోటీచేసిన చాలా చోట్ల డిపాజిట్లను కోల్పోయింది. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 41.29 శాతం ఓట్లు, 9 సీట్లు, బీజేపీకి 19.45 శాతం ఓట్లు, 4 సీట్లు, కాంగ్రెస్‌కు 29.48 శాతం ఓట్లు, 3 సీట్లు, ఎంఐఎంకు 2.78 శాతం ఓట్లు, 1 సీటు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 66 అసెంబ్లీ సీట్లలో టీఆర్‌ఎస్, 21 అసెంబ్లీ సీట్లలో బీజేపీ, 22 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌కు ఓట్ల ఆధిక్యత లభించింది. ప్రధాని మోదీ ప్రభంజనం, బీజేపీ వైపు అన్ని వర్గాల ఓటర్లు మొగ్గడం వల్ల ఆ పార్టీకి ఉత్తర తెలంగాణలో గిరిజన ప్రాంతమైన ఆదిలాబాద్ సీటుతో సహా నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ సీట్లు వచ్చాయి. దీంతో బీజేపీ నేతలు పార్టీ బలోపేతంపై దృష్టిని సారించారు.
టీఆర్‌ఎస్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర పార్టీని ఆదేశించింది. రానున్న రోజుల్లో పార్టీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి సీనియర్లను, నేతలను చేర్చుకోనున్నారు. కర్నాటక తరహాలో తెలంగాణలో కూడా పాగా వేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది.