ఆంధ్రప్రదేశ్‌

బకాయిలు చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ టిఎస్‌ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ పిలుపుమేరకు మంగళవారం రాష్ట్రంలోని అన్ని బస్ డిపోలలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం ఉగాదికి చెల్లించాల్సిన రెండో విడత ఎరియర్స్‌ను యాజమాన్యం చెల్లించకపోవడంతో నల్లబ్యాడ్జిలు ధరించి విధులు నిర్వహించామని ఎంప్లారుూస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి తెలిపారు. గత సంవత్సరం మే 13న జరిగిన ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసికి ప్రతినెల రూ. 75 కోట్లు అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు. నేటికీ ఐదు నెలలకు సంబంధించి రూ. 375 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. అదే క్రమంలో పే స్కేల్స్‌కు సంబంధించి రూ. 300 కోట్లు చెల్లించాల్సి ఉండగా అవి కూడా పూర్తిగా చెల్లించలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి వాయిదా 2015లో దసరా పండుగకు, రెండో వాయిదా 2016 ఉగాదికి, మూడో వాయిదా 2016 దసరాకు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే మొదటి హామీ అమలైంది, కానీ ఉగాదికి రావాల్సిన రెండో విడత నేటికీ చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, ఆర్టీసి యాజమాన్యం స్పందించని పక్షంలో కార్మికులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగవలసి వస్తుందని వారు హెచ్చరించారు.

నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌పై స్టే

కేంద్రమంత్రి సుజనాకు కొంత ఊరట
26న కోర్టుకు రాకుండా మినహాయింపు
మే 5న హాజరు కావలసిందేనన్న హైకోర్టు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: ఒక కేసులో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ నెల 26వ తేదీన కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. కాగా మే 5వ తేదీన మాత్రం ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తాను ఈ నెల 26వ తేదీన నాంపల్లి కోర్టుకు హాజరు కాలేనని, అలాగే తనపై విచారణ జరుగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని మంత్రి సుజనా చౌదరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలాంగో విచారించారు. మంత్రి తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ భాను వాదనలు వినిపిస్తూ తన క్లైంట్లు కేంద్ర మంత్రి అయినందు వల్ల బిజీగా ఉంటారని, అందువల్ల కోర్టుకు హాజరు కాలేరని తెలిపారు. తన క్లైంటు సుజనా చౌదరి ఇప్పటికే కోర్టుకు హాజరుకాలేకపోవడానికి కారణాలను వివరిస్తూ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. కింది కోర్టు ఇచ్చిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని, సుజనా చౌదరిపై జరుగుతున్న కేసు విచారణను కొట్టివేయాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని నాంపల్లి కోర్టులో ఫిర్యాదు పిటిషన్ దాఖలు చేసిన మారిషస్ బ్యాంకు తరఫున న్యాయవాదిని ప్రశ్నించారు. బ్యాంకు న్యాయవాది స్పందిస్తూ ఈ వారెంటుపై స్టే ఇస్తే తమకు అభ్యంతరం లేనదన్నారు. కాని కేసును కొట్టివేయాలంటే తమ వాదనలు వినాల్సి ఉంటుందన్నారు. అనంతరం కోర్టు ఈ నెల 26వ తేదీన హాజరు కావాలంటూ జారీ చేసిన వారెంటుపై స్టే ఇచ్చారు. కాగా మే 5వ తేదీన కోర్టుకుహాజరు కావాలని హైకోర్టు మంత్రి సుజనా చౌదరిని ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు పొందాలంటే విచారణ కోర్టుకు హాజరై సంబంధించి నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. కేసు విచారణను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేశారు.