ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌ఆర్‌బిసి డిఇ ఆస్తులు 10కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 12: కర్నూలు జిల్లా నంద్యాలలో ఎస్‌ఆర్‌బిసి డిఇగా పనిచేస్తున్న శేషుబాబు కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్టు ఎసిబి అధికారుల సోదాల్లో వెల్లడయింది. శేషుబాబు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే సమాచారంతో నంద్యాలలోని ఆయన నివాసంతో పాటు బేతంచెర్ల, బనగానపల్లి, కర్నూలు, హైదరాబాద్‌ల్లోని ఆయన బంధువుల నివాసాల్లో మంగళవారం ఎసిబి అధికారులు కర్నూలు ఏసీబీ డీ ఎస్పీ మహబూబ్ పాషా నేతృత్వంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
కేవలం నంద్యాలలో జరిపిన సోదాల్లోనే 10 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు బయటపడినట్టు ఎసిబి అధికారులు తెలిపారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని చెప్పారు. సోదాలు పూర్తయిన తరువాతనే శేషుబాబు ఆస్తుల పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. శేషుబాబు భార్యకు చెందిన బంధువులు బేతంచెర్ల, బనగానపల్లెలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ బయటబడిన ఆస్తుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఎసిబి దాడుల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో ఉన్న పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కొందరు అప్రమత్తమై తమ ఇళ్ళకు తాళాలు వేసి వెళ్లిపోగా, మరి కొందరు తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను, నగదు, బంగారు, తదితర వాటిని రహస్య ప్రాంతాలకు తరలించి జాగ్రత్త పడ్డారు.

ప్రతి నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం

ఆన్‌లైన్ సేవలు ప్రారంభం
14 రోజుల్లో అనుమతులు
హోంమంత్రి నాయిని

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: ఏడాదిలోగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో అగ్నిమాపక వారోత్సవాలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించతలపెట్టిన అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి 14 రోజుల్లోగా అగ్నిమాపక శాఖ అనుమతి ఇచ్చేందుకు తగు ఏర్పాటు చేశామని, ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ సేవలను ఆయన ప్రారంభించారు. పెద్ద భవంతులు, విల్లాలు, మల్టిప్లెక్స్, మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్, సినిమా థియేటర్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు వంటి వాటికి అగ్నిమాపక సర్వీసుల శాఖ అనుమతిని ఆన్‌లైన్‌లో పొందవచ్చని మంత్రి తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 112 కోట్లు మం జూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతానికి రాష్టవ్య్రాప్తంగా 18 నియోజకవర్గాల్లో అగ్నిమాపక కేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో ఎక్కడైనా పుట్టింగల్ (కేరళ) వంటి ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అగ్నిమాపక సిబ్బంది అవగాహన కలిగివుందన్నారు. ఈ సంవత్సరం 86 అగ్నిప్రమాదాలు నమోదయ్యాయని, భారీ ప్రమాదాలు జరుగకుండా సిబ్బంది నివారించగలిగిందన్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణకు రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను మంత్రి నాయిని ఆవిష్కరించారు.

సచివాలయంలో మంగళవారం అగ్నిమాపక కేంద్రాల ఆన్‌లైన్ సేవలను ప్రారంభిస్తున్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడి