ఆంధ్రప్రదేశ్‌

సమస్యల వలయంలో విలీన మండలాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 12: విభజన చట్టం ఆర్డినెన్స్‌తో విలీనమైన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారిగా అడుగుపెడుతున్నారు. భౌగోళికంగా విలీనం జరిగిందే తప్ప పాలనాపరంగా సేవలు ఈ మండలాల ప్రజలందరికీ చేరలేదు. వౌలిక సదుపాయాలు లేక ఇక్కడి జనజీవనం సమస్యలతో సతమతమవుతోంది.
పోలవరం ప్రాజెక్టు సత్వర సాధనే ధ్యేయంగా ఖమ్మం జిల్లాలో ఉండే కూనవరం, చింతూరు, విఆర్ పురం, నెల్లిపాక మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో, కుకునూరు, వేలేరుపాడు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయటంతో, ప్రాజెక్టు కంటే ముందే మమ్మల్ని ముంచేశారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ మండలాల్లో పాలనా వ్యవస్థకానీ, పర్యవేక్షణ కానీ లేకుండా పోయింది. విద్యావ్యవస్థ చచ్చుబడింది. ఆసుపత్రుల్లో సిబ్బంది లేమి, కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత, కానరాని రవాణా సదుపాయం, టెన్త్ విద్యార్థులు ఇంటర్ ఎక్కడ చేరాలో తెలీని అయోమయం, మూలన పడ్డ మంచినీటి పథకాలు, చెప్పనలవి కాని విద్యుత్ సమస్యలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అంతేలేని కష్టాలు ఈ విలీన గ్రామ ప్రజలవి. వౌలిక సమస్యల పరిష్కారానికి ప్రజలు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడి ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
విలీనం అనంతరం దాదాపు రెండేళ్లకు గానీ కార్యాలయాల నిర్మాణానికి పూనుకోలేదు. ఎట్టకేలకు సిఎం శంకుస్థాపన చేయనున్న ఐటిడిఎ కార్యాలయం, ట్రెజరీ కార్యాలయం త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతున్నారు. విలీన మండలాల కేంద్రంగా కూనవరంలో బస్సు డిపో ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.
విలీన కారణంగా ప్రధానంగా జాతీయ ఉపాధి హామీ పథకం పనులు మూలన పడ్డాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చి డ్రాపవుట్లను తగ్గించాలని కోరుతున్నారు. ఇప్పటి వరకూ ఖమ్మం జిల్లాలో చదువుకున్న విద్యార్థులు నాన్‌లోకల్ సమస్య ఎదుర్కోవలసి వస్తోంది.
భద్రాచలం డివిజన్ మొత్తం ఆంధ్రాలోనే కలపాలని డిమాండు కూడా వ్యక్తమవుతోంది. నాలుగు మండలాలు ఎటూ కాకుండా ఉన్నాయని, ఈ మండలాలను కూడా ఆంధ్రాలో విలీనం చేస్తే పాలనా పరంగా గట్కెక్కుతామంటున్నారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం చింతూరు కేంద్రంగా ఆదివాసీ జిల్లా ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. ఎటపాకలో హామీ ఇచ్చినట్లుగానే ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసిన సిఎం కోతులగుంట గ్రామంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నిర్వాసితులందరికీ పట్టిసీమ మాదిరిగానే పోలవరం పరిహారం ఇవ్వాలని, ఏర్పాటుచేస్తున్న ఐటిడిఎలో ఆదివాసీలకే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ సిఎం రాకతోనైనా విలీన సమస్యలు పరిష్కారం కాగలవని ఆ ప్రాంత వాసులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

విలీన గ్రామాలకు చంద్రబాబు
విభజన తరువాత తొలి పర్యటన చింతూరు కేంద్రంగా మరో ఐటిడిఎ ఏర్పాటు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 12: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీలో విలీనం అయిన 7మండలాల గ్రామాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఈ మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన రెండేళ్ల తరువాత చంద్రబాబు ఈ గ్రామాల్లోకి వెళ్లడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన ఈ మండలాల్లో కొన్ని గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్న సమయంలో చంద్రబాబు ఈ గ్రామాల్లో పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వీలీన గ్రామాల్లో ఒకటైన చింతూరు కేంద్రంగా కొత్త ఐటిడిఏను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఐటిడిఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాడేరు, సీతంపేట, రంపచోడవరం, కోటరామచంద్రపురం, చెంచుల కోంస శ్రీశైలంలో, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రత్యేకంగా ఐటిడిఎలను ఏర్పాటు చేశారు. చింతూరు కేంద్రంగా ఏర్పాటవుతున్న ఐటిడిఏ ఏడవది. ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ఏడు మండలాల్లో గిరిజనులే అధిక సంఖ్యలో ఉన్నారు. భద్రాచలం రెవెన్యూ మండలం (్భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), కూనవరం రెవెన్యూ మండలం, చింతూరు రెవెన్యూ మండలం, వర రామచంద్రపురం రెవెన్యూ మండలాలు తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేశారు. చింతూరు కేంద్రంగా ఐటిడిఏను ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పై నాలుగు మండలాల్లోని సంక్షేమం, గిరిజనాభివృద్ధి లక్ష్యంగా ఐటిడిఏ పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఐటిడిఏకు అధికారులను, సిబ్బందిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

భద్రాచలానికి
ప్రత్యేక బస్సులు

శ్రీరామనవమికి ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 14 నుంచి 16 వరకు భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసి సీనియర్ పబ్లిక్ రిలేషన్ మేనేజర్ జిఆర్ కిరణ్ తెలిపారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి భక్తుల సౌకర్యార్థం నడిపించే ఈ బస్సు సర్వీసులు బిహెచ్‌ఇఎల్, కూకట్‌పల్లి, హైదరాబాద్ ఎంజిబిఎస్ నుంచి నడుస్తాయని ఇట్టి బస్సులకు అడ్వాన్సు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్స్ కోసం సమీపంలోని ఎటిబి ఏజెంట్, అన్ని బస్సు స్టేషన్లలోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్ల నుంచి గానీ లేదా నేరుగా తీతీతీ.ఆఒఆష్యశజశళ.జశ ద్వారా పొందవచ్చని తెలిపారు. ఈ ఆపరేషన్‌ను ఎంజిబిఎస్ నుంచి పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

కోరుట్ల ఎమ్మెల్యే ఎన్నికపై పిటిషన్ కొట్టివేత

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: కరీంనగర్ జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు ఎన్నికను సవాలు చేస్తూ కె నరేష్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కె విద్యాసాగర్‌రావుచేతిలో కె నరేష్‌కుమార్ ఓడిపోయారు. అనంతరం ఈ ఎన్నిక చెల్లదంటూ నరేష్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తాను శివసేన తరఫున పోటీ చేశానని, కాని రిటర్నింగ్ అధికారి పార్టీ చిహ్నాన్ని సకాలంలో కేటాయించలేదని, దీనివల్ల ఓటర్లు గందరగోళానికి గురై టిఆర్‌ఎస్ అభ్యర్థిని ఎన్నుకున్నారని నరేష్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించాలని ఆయన అభ్యర్ధించారు. ఈ కేసును జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. పిటిషనర్ తగిన సాక్ష్యాధారాలు చూపించలేదంటూ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.