రాష్ట్రీయం

రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంపై రాజీలేని పోరాటం చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుస్పష్టం చేశారు. పార్లమెంట్‌లో అంశాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో గురువారం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుఅధ్యక్షతన జరిగింది. ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన హామీలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై వత్తిడికి అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ వైఖరిని తీసుకోకుండా తటస్థంగా వ్యవహరించే వైఖరిని అవలంభిద్దామని సూచించినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీలేని పోరాటం చేద్దామన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం, నీతి అయోగ్ సిఫారసుల మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం కేంద్రం వత్తిడి తీసుకరావాల్సిందేనని ఎంపీలకు అధినేత కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది.
టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకునిగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావును సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అలాగే లోక్‌సభలో పార్టీ నాయకునిగా ఖమ్మం లోక్‌సభ సభ్యుడు నామా నాగేశ్వర్‌రావు, లోక్‌సభ ఉప నాయకునిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, విప్‌గా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌ను సమావేశం ఎన్నుకుంది. అలాగే రాజ్యసభలో పార్టీ నాయకునిగా కేశవరావు, ఉప నాయకునిగా బండ ప్రకాశ్, విఫ్‌గా జోగినపల్లి సంతోష్‌కుమార్ ఎన్నికైనట్టు ప్రకటించింది.

చిత్రాలు.. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యను శాలువా కప్పి ఆశీర్వదిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

*కేశవరావు * నామా నాగేశ్వర్‌రావు * కొత్త ప్రభాకర్‌రెడ్డి * బండా ప్రకాశ్ * జోగినపల్లి సంతోష్‌కుమార్