రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 15: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీనే కనిపిస్తుందని, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను ఎదుర్కోవడం బీజేపీతోనే సాధ్యమవుతుందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంఛలన వాఖ్యలు చేశారు. శనివారం రాత్రి ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ లోపంతోనే పార్టీకి నష్టం వాటిల్లుతుందని, నాయకత్వ మార్పు కోసం తాను ముందే చెప్పినా పట్టించుకోలేదని ఫలితం ఇప్పుడు అందరు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతే, సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే జాతీయ స్థాయి నాయకత్వం నుండి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. డీకే అరుణ వంటి నాయకులు సైతం పార్టీ నుండి ఎందుకు వెళ్లిపోయారో అధినాయకత్వం ఆలోచించాలన్నారు. కుంతియా, ఉత్తమ్‌లు తీసుకున్న నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కునారిల్లిపోతుందన్నారు. పలువురు కీలక నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారన్నారని, పార్టీ భవిష్యత్‌పై కార్యకర్తలు నిరాశలో ఉన్నారన్నారు. రాహుల్ నాయకత్వం బలహీన పడిందన్న భావనలో నాయకులు ఉన్నారన్నారు. ప్రస్తుతానికి తనకు కాంగ్రెస్ పార్టీని వీడటం, బీజేపీలో చేరడం వంటి ఆలోచనలు లేవని, భవిష్యత్‌లో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.