రాష్ట్రీయం

ముంపు గ్రామాలకు ముంచుకొస్తున్న ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు ముప్పు ముంచుకొస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నది మధ్యలో నిర్మించిన కాఫర్ డ్యాం కారణంగా 27 గ్రామాలు నీట మునిగే అవకాశముంది. ఏటా వరదల సీజనులో ఈ గ్రామాలకు తాత్కాలిక ముంపు తప్పనిసరి అయినప్పటికీ, ఈసారి కాఫర్ డ్యాం అడ్డుగా ఉండటం వల్ల వరద నీరు దిగువకు సులభంగా వెళ్లే అవకాశంలేదు. దీనితో ఈ గ్రామాలకు ప్రమాదం పొంచివుంది. ఏటా సీజన్‌లో ఈ గ్రామాలకు వరద ప్రభావం కొత్త కాదు. కానీ ఈ ఏడాది వరద నీటిని కాఫర్ డ్యామ్ అడ్డుకుంటుంది. దీంతో వరద తీవ్రత అధికంగా ఉంటుంది. అందువల్ల వరద ముంచుకొచ్చేలోపు ఆయా గ్రామాలను ఖాళీ చేయాల్సిందే. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కాఫర్ డ్యామ్ నిర్మాణానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులను ప్రారంభించారు. తొలుత కాఫర్ డ్యాంను త్వరితగతిన పూర్తిచేసి, 2018 నాటికి గ్రావిటీపై నీరివ్వాలని సంకల్పించారు. అనంతరం మళ్ళీ 2019నాటికి అనుకున్నారు. అవేమీ పూర్తికాకున్నా, ఇప్పుడు మహోద్ధృతంగా వచ్చే వరదను మాత్రం కొంతమేర ఈ కాఫర్ డ్యాం అడ్డుకోవడం ఖాయం.
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే ప్రాజెక్టుకు ఎగువన తూర్పు గోదావరి జిల్లాలోని 27 గ్రామాలు ముంపునకు గురవుతాయి. అయితే భద్రాచలం నుండి వరద నీరు వడివడిగా ప్రవహిస్తూ ధవళేశ్వరం బ్యారేజీ దిగువన సముద్రంలో కలుస్తుంది. అందువల్ల భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు. ఎగువ నుండి వరద నీరు వచ్చే ఉద్ధృతిని బట్టి ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తారు. ఫలితంగా దిగువనున్న కోనసీమలోని లంక గ్రామాలు ముంపునకు గురవుతుంటాయి. ఇది ఏటా జరిగేదే. అయితే ఈసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి 600 మీటర్ల దూరంలో కాఫర్ డ్యామ్ నిర్మాణం జరుగుతోంది. కాఫర్ డ్యామ్ నిర్మాణానికి మట్టి, రాయి గోదావరి పొడవునా అడ్డుకట్టగా వేయనున్నారు. దీనిని 2.5 కిలో మీటర్ల పొడవు, 145 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే కాఫర్ డ్యాం నిర్మాణం కొంత మేర పూర్తయిన దృష్ట్యా ఈసారి పైనుండి వచ్చే వరద నీటిని ఇది నిలువరిస్తుంది. అంటే భద్రాచలం నుండి వచ్చే వరద నీరు కాఫర్ డ్యాంకు ఎగువన నిలిచిపోతుంది. దానివల్ల వరద ప్రభావం ధవళేశ్వరం బ్యారేజీవద్ద ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ కాఫర్ డ్యాం వద్ద నిలువరించే వరద నీటి కారణంగా ముంపు గ్రామాలకు వరద తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా. దేవీపట్నం మండలం వీరవరం లంక, ఎ వీరవరం, మంటూరు, మడిపల్లి, మూలమెట్ట, మెట్ట వీధి, పెనికలపాడు, దండంగి, అగ్రహారం, మూలపాడు, కొండమొదలు, మెట్టగూడెం, కె గొందూరు, కచ్చులూరు, సిహెచ్ రమణయ్యపేట, ఏనుగులగూడెం, గంగులగొంది, తొయ్యేరు, గంగంపాలెం, సుద్ధకొండ, గుబ్బలంపాడు, సీతారం, లింగవరం, తాళ్ళూరు, నడిపూడి, సోమర్లపాడు, కొక్కిరగూడెం, పెద్దగూడెం, తెలిపేరు గ్రామాలు నీట మునిగిపోతాయి. పోలవరం జలాశయం స్ధూల నిల్వ సామర్ధ్యం 194.60 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి మట్టం ప్లస్ 45.72 మీటర్లు. అయితే కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం వల్ల అత్యవసరంగా ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి వుంది. ఇప్పటి వరకు నిర్మించిన స్థాయి వల్ల భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే దేవీపట్నం మండలంలోని ఈ గ్రామాలు ముంపునకు గురవుతాయి. వరదల నేపధ్యంలో ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టి యుద్ధ ప్రాతిపదికన తరలించడానికి చర్యలు చేపట్టాల్సివుంది.
కాఫర్ డ్యాం కారణంగా వరదల సమయంలో పలు గ్రామాలు ముంపుబారిన పడే అవకాశమున్నందున పునరావాస చర్యలు చేపట్టాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అధారిటీ కూడా అధికార్లను ఆదేశించింది. గోదావరి నదికి జూలై, ఆగస్టు మాసాల్లో వరదలు వచ్చే అవకాశం వుందని అంచనావేశారు. దీనితో కమ్యూనికేషన్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా వైర్‌లెస్ సెట్లు, విల్, శాటిలైట్ ఫోన్లు కూడా అవసరాన్ని బట్టి సిద్ధంచేస్తున్నారు.
*
నిర్మాణంలో ఉన్న కాఫర్ డ్యాం (ఫైల్ ఫొటో)