రాష్ట్రీయం

డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం శాసనసభాపతి స్థానంలో గౌరవ మర్యాదలతో ఆశీనులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వెంటరాగా స్పీకర్ స్థానంలో కోన రఘుపతి కూర్చున్నారు. ఇటీవల స్పీకర్‌గా తమ్మినేని బాధ్యతల స్వీకారం సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు సభా మర్యాదలు పాటించలేదని ఆయన బంట్రోతుగా అచ్చెన్నాయుడును పంపారని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభలో వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విషయంలో అధికార, విపక్ష సభ్యులు సభా సాంప్రదాయాలను గౌరవించారనేది స్పష్టమవుతోంది.
డిప్యూటీ స్పీకర్‌గా రఘుపతి ఒకరే నామినేషన్ దాఖలు చేయటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. రఘుపతి తండ్రి కోన ప్రభాకర్‌రావు గవర్నర్‌గా, మంత్రిగా, స్పీకర్‌గా ఉమ్మడి రాష్ట్రంలో అందించిన సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కోన తండ్రి ఆశయాలు, విలువలకు అనుగుణంగా సభలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని తాను విశ్వసిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతించారు. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రఘుపతిని అభినందించారు. కోన ప్రభాకరరావుతో తనకు గతంలో ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రస్తావించారు. తండ్రికి తగిన తనయుడుగా రఘుపతి రాణించాలన్నారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్త్ఫా మాట్లాడుతూ నైతిక విలువలకు కట్టుబడి వివాదరహితునిగా పేరున్న రఘుపతి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కావటం అభినందనీయమన్నారు శాసనసభకు ఆయన సేవలు అవసరమన్నారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ తనపై విశ్వాసంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్‌గా తన విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
ఆరుగురు ప్యానల్ స్పీకర్ల నియామకం
అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్లుగా ఆరుగురిని నియమించారు. పీడిక రాజన్నదొర, ప్రసన్నకుమార్‌రెడ్డి, అంబటి రాంబాబు, చింతల రామచంద్రారెడ్డి, వై కళావతి, ముదునూరి ప్రసాదరాజులను ప్యానల్ స్పీకర్లుగా నియమిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం ప్రకటించారు.
చిత్రం...డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోన రఘుపతిని ఆయన స్థానం వరకు తోడ్కొని వెళుతున్న ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు