రాష్ట్రీయం

నేడు ఎడ్‌సెట్.. రేపు పీజీఈసెట్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెండేళ్ల బిఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి బుధవారం ఉదయం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ప్రొఫెసర్ టీ మృణాళినీ, కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావుపాల్గొంటారు. కాగా పీజీఈసెట్ ఫలితాలను గురువారం ఉదయం విడుదల చేయనున్నారు. ఇంజనీరింగ్ స్ట్రీం పీజీ కోర్సుల్లో ప్రవేశించేందుకు పీజీఈసెట్‌ను నిర్వహించారు. ఫలితాలను మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి విడుదల చేస్తారు. 19 విభాగాల్లో నిర్వహించిన పరీక్షకు 20,415 మంది రిజిస్టర్ చేసుకోగా, 17,722 మంది హాజరయ్యారని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం కుమార్ చెప్పారు.