రాష్ట్రీయం

రెండేళ్లలో పోలవరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూన్ 20: ఎటువంటి హడావుడి, ఒత్తిళ్లు లేకుండా, పనుల నాణ్యతలో రాజీపడకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2021 జూన్ నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార్లను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని గురువారం ముఖ్యమంత్రి సందర్శించారు. ఈసందర్భంగా జలవనరుల శాఖ అధికార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పనులు జరుగుతున్న తీరును సమీక్షించారు. ఎంతకాలంలో ప్రాజెక్టు పనులన్నీ పూర్తిచేస్తారో స్పష్టంగా చెప్పాలని ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికార్లను కోరారు. ఒకటి, రెండు నెలలు సమయం తీసుకున్నా ఫర్వాలేదని, పనుల నాణ్యత, పూర్తయ్యే
సమయం విషయంలో కచ్చితంగా ఉండాలన్నారు. తన పద్ధతి ప్రకారం ప్రకటిస్తే ఆ సమయానికి పనులు పూర్తవ్వాలని పేర్కొన్నారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా 2021 జూన్ నాటికి పోలవరం పనులన్నీ పూర్తవుతాయని ఇంజినీరింగ్ అధికారులు ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఆ తర్వాత మరో పది నెలల్లో పోలవరం జలవిద్యుత్ కేంద్రం పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్భాటం కోసం హడావిడిగా పనులు చేయవద్దని, ఎన్నో దశాబ్దాలు సేవలందించాల్సిన ప్రాజెక్టు పనులు అత్యంత నాణ్యతతో పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే 2016లో తన పర్యటన సందర్భంగా కుక్కునూరు ప్రాంతంలో నిర్వాసితులకు తానిచ్చిన హామీ ప్రకారం పునరావాస పరిహారం రూ.10 లక్షలకు పెంచే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని అధికార్లకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్టు కోసం ప్రారంభంలోనే భూములిచ్చిన రైతులకు అదనంగా పరిహారం ఇచ్చే విషయంలో కూడా సానుకూల వైఖరి అవలంబించాలని అధికార్లకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నష్టపోయామని ఏ ఒక్క కుటుంబం భావించకూడదనేది తన ఉద్దేశమన్నారు. రైతులతో పాటు ఇతర ప్రజలు కూడా బాధపడకుండా ఉండేలా పునరావాస ప్యాకేజీ పటిష్టంగా ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్, ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌చంద్ర బోసు, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కె కన్నబాబు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదినాథ్‌దాస్, పోలవరం ప్రాజెక్టు ఈఎన్‌సీ ఎం వెంకటేశ్వరరావు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు ముత్యాలరాజు, మురళీధర్ రెడ్డి, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
చిత్రం... హిల్‌వ్యూ ప్రాంతం నుండి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి