రాష్ట్రీయం

‘మిక్చర్’నూ బొక్కేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపులకు గత ప్రభుత్వం పసుపు కుంకుమ పేరిట రూ. పదేసి వేలు పంపిణీ చేసేందుకు ఒక్కో మహిళకు రూ.15ల చొప్పున సమావేశ ఖర్చులు కింద విడుదలైన నిధులు కూడా కైంకర్యమైన విషయం బయటకు పొక్కింది. గత ప్రభుత్వం పసుపు కుంకుమ పేరిట ఒక్కొక్క డ్వాక్రా మహిళకు రూ.10వేలు చొప్పున పంపిణీ చేసింది. మూడు దపాలుగా మార్చుకునే విధంగా చెక్కులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 98 లక్షల మంది డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద నిధులు విడుదల చేశారు. ఎన్నికల ముందు ఈ తంతు పూర్తయింది. పసుపు కుంకుమ కింద ఎన్ని చెక్కులు ఏ విధంగా మారాయో అనే విషయాన్ని పక్కనబెడితే చెక్కులు అందుకునేందుకు వచ్చినవారికి చిరుతిండి, మంచినీటి సదుపాయాలు కల్పించేందుకు ఒక్కో మహిళకు ప్రభుత్వం ఖర్చుల కింద రూ.15ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.15 కోట్లు కేటాయించింది. ఈ నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేయకుండా సుమారు రూ.10 కోట్ల వరకు కైంకర్యమైనట్టు తెలిసింది. ఇందు కోసం పంపిణీ చేసిన నిధులు గోల్‌మాల్ అయినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా, ఆయా మీటింగ్‌లకు వచ్చే మహిళలకు ప్రభుత్వం నిర్ధేశించినట్టుగా ఒక్కో మహిళకు రూ.15ల చొప్పున ఒక్కో పంచాయతీ నుంచి సుమారు రూ.6వేల చొప్పున పిండేశారని తెలిసింది. ఈ భారాన్ని పంచాయతీలపై ఎంపీడీవోలు రుద్దినట్టు తెలుస్తోంది. ప్రజాధనంతో పరోక్షంగా పథకం పేరుతో ఓట్లు కొనేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినప్పటికీ పంపిణీ జరిగిపోయింది. మండలాలవారీగా అప్పట్లో ఈ పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ నిమిత్తం వచ్చే మహిళలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించారంటున్నారు. ఒక్కో మండలానికి 250 నుంచి 300 గ్రూపులు ఉండగా సగటున ఒక్కో మండలంలో 25 నుంచి 30 వేల మంది ఈ సమావేశాలకు వస్తారని, ఆయా ఎమ్మెల్యేల ద్వారా చెక్కులిచ్చినప్పటికీ ఆ భారం మాత్రం నేటికీ పంచాయతీలపై పడింది. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ సభల తాలూకు ఖర్చును కూడా పంచాయతీలు భరించాయి. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు ఎంపీడీవోలు అట్టేపెట్టేసుకుని, చెక్కుల పంపిణీ సభల ఖర్చుల నిమిత్తం ఆయా పంచాయతీల నుంచి సుమారు రూ.6వేల చొప్పున లాగేశారని తెలిసింది. ఎంపీడీవోలు నోటిమాటగా చెప్పి ఈ నిధులను పంచాయతీల నుంచి మళ్లించారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పంచాయతీల్లో కార్యదర్శులదే పెత్తనం కాబట్టి మండలాల వారీగా నిధులు పిండేసినట్టు తెలిసింది. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాలో 1040 పంచాయతీలు వుండగా అన్ని పంచాయతీల నుంచి సభల ఖర్చు లాగేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాలో సుమారు రూ.50 లక్షల వరకు పక్కదారి పట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ సభల సాదర ఖర్చు నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను మండలాల ఖజానాలో అలాగే ఉంచి అందుకు దామాషాగా నోటిమాటతో పంచాయతీల నుంచి వినియోగించి ఆనక ఆ నిధులను పక్కదారి పట్టించారని తెలిసింది. ఈ నిధులను కింద నుంచి పై వరకు పంచుకున్నారని తెలిసింది. ఎంపీడీవోలు ఈ ఖర్చుల నిమిత్తం పంచాయతీలపై భారం పెట్టి ప్రభుత్వం నుంచి వచ్చిన మిక్చర్, స్వీట్ కలిపి పాలిథీన్ కవర్‌లో ప్యాక్ చేసి ఇవ్వడానికి కేటాయించినందుకు ప్రభుత్వం నుంచి ఒక్కో మహిళలకు కేటాయించిన రూ.15ల చొప్పున నొక్కేసారని తెలిసింది. చెక్కులు ఇచ్చే సమయంలో స్టేషనరీ ఖర్చుల నిమిత్తం ఒక్కో మహిళల నుంచి రూ.200ల చొప్పున వసూలు చేసినట్టు కూడా తెలిసింది.