రాష్ట్రీయం

హైకోర్టు సీజేగా చౌహాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ శనివారం ఉదయం రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ జస్టిస్ చౌహాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, గవర్నర్ దంపతులతో పాటు తెలంగాణ, ఆంధ్రా, కర్నాటక హైకోర్టులకు చెందిన పలువురు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏ వేంకటేశ్వరరెడ్డి, జస్టిస్ చౌహాన్ కుటుంబ సభ్యులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. జస్టిస్ చౌహాన్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్టప్రతి జారీ చేసిన ఉత్తర్వులను రిజిస్ట్రార్ జనరల్ వేంకటేశ్వరరెడ్డి చదివి వినిపించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ జస్టిస్ చౌహాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చౌహాన్ మార్చి 28వ తేదీ నుండి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడంతో జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ సీనియర్ న్యాయమూర్తిగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు.
హోం మంత్రి మహమూద్ అలీ, ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్, ఎక్సైజ్ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, రవాణా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం...రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ చౌహాన్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్