రాష్ట్రీయం

గుంతకల్ రైల్వే డివిజన్‌కు గ్రీన్ - కోప్లాటినం సర్ట్ఫికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: పర్యావరణ పరిరక్షణ దిశగా గుంతకల్ రైల్వే డివిజన్ ఆవరణలో పూర్తిగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసిన గుంతకల్ రైల్వే స్టేషన్‌కు గ్రీన్-కో ప్లాటినం సర్ట్ఫికెట్‌ను కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ప్రకటించిందని రైల్వే బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. ఆదివారం రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ హాల్‌ను రైల్వే బోర్డు చెర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే ఉద్యోగుల నుద్దేశించి మాట్లాడుతూ రేణిగుంటలోఏర్పాటు చేసిన గ్రీన్ బిల్డింగ్ రైల్వే సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేణిగుంటలో పాత బిల్డింగ్‌ను పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. దీనికి రైల్ కల్యాణ్ కమ్యూనిటీ హాల్‌గా పేరు పెట్టారు. ఈ బిల్డింగ్‌లో వేడుకలు, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించుకోవడానకి ఉద్యోగులకు అనువుగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ‘మీస్వరం’ అనే బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎం గజానన్, గుంతకల్ డివిజనల్ మేనేజర్ విజయప్రతాప్ సింగ్ పాల్గొన్నారు.