రాష్ట్రీయం

ఓఎన్జీసీ పైప్‌లైన్ లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరీ జీసీయస్ పరిధిలోని కేశవదాసుపాలెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున గ్యాస్ లీకై ప్రజలను మరొక్కసారి భయాందోళనకు గురిచేసింది. మోరీ జీసీయస్ పరిధిలోని 10, 21, 25, 26 నెంబర్ల గల బావుల నుండి జీసీయస్‌కు అనుసంధానమయ్యే పైపులైన్‌కు కేశవదాసుపాలెం బెల్లంకొండ వారి వీధిలో లీకేజీ సంభవించింది. పెద్ద శబ్దాలతో దాదాపు పది అడుగుల వరకు గ్యాస్, క్రూడాయిల్ వెదజల్లింది. స్థానికులు మోరీ జీసీయస్ అధికారులకు సమాచారం అందించడంతో వారు అప్రమత్తమై ఈ బావుల నుండి వచ్చే మొయిన్ పైపులైన్ మూసివేయడంతో లీకేజీ అదుపులోకి వచ్చింది. రాజోలు అగ్ని మాపక సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో జనావాసాల మధ్య నుండి పైపులైను పైపులైను నిర్మాణం జరిగి దాదాపు 20 సంవత్సరాలు కావస్తుండడంతో వాటి సామర్ధ్యం తగ్గి లీకేజీలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓఎన్జీసీ అధికారులు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సఖినేటిపల్లి తహసీల్దారు రాజ్యలక్ష్మి, రాజోలు సీఐ శేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు చైతన్యకుమార్, శ్రీనివాస్, శ్రీరచన తదితరులు పరిస్థితిని సమీక్షించారు.

చిత్రం... పైపులైను లీకేజీతో ఉబికివస్తున్న క్రూడాయిల్