రాష్ట్రీయం

28న ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 28న హైదరాబాద్‌లో సమావేశం కానున్నారని సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై చర్చించడానికి వీరు ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారని తెలిసింది. ఈ నెల 27న కొత్త సచివాలయం, శాసనసభ సముదాయ భవనాలకు భూమి పూజ జరుగనుంది. ఆ రోజు హైదరాబాద్‌లోనే ఉండే ఏపీ సీఎం వైఎస్ జగన్ భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను అప్పగించడం వల్లనే కొత్త సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమం అయిందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయ నిర్మాణానికి జరిగే పూజ కార్యక్రమానికి ఏపీ సీఎంను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ భావిస్తోన్నట్టు తెలిసింది. ఆ మరుసటి రోజు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న జల వివాదాలపై ఈ ఇరువురు సీఎంలు చర్చించి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిసింది. ఇద్దరు సీఎంల భేటీ తర్వాత ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు సమావేశమై వివాదాల పరిష్కారానికి రోడ్ మ్యాప్ రూపొందిస్తారని తెలిసింది. ఏపీ అధికారులు మొదట హైదరాబాద్‌కు వచ్చి సమావేశమయ్యాక, తెలంగాణ అధికారుల బృందం అమరావతికి వెళ్లనున్నారని అధికార వర్గాల సమాచారం.