రాష్ట్రీయం

అంగరంగ వైభవంగా ‘ఇస్తా’ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: ఇంటర్నేషనర్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఇస్తా) 32 వ అంతర్జాతీయ సదస్సు అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమైంది. 70 దేశాల నుండి 400 మంది ప్రతినిధులతో పాటు దేశంలోని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలకు చెందిన 300 మంది శాస్తవ్రేత్తలు, అధికారులు హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును స్పాన్సర్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరీ ముఖ్యంగా అధికారులు ఏడాది నుండి ఇందుకోసం కృషి చేస్తూవచ్చారు. బుధవారం ప్రారంభమైన ఈ సదస్సు 2019 జూలై 3 వరకు కొనసాగుతుంది. జూన్ 26 నుండి 28 వరకు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌లో దాదాపు 100 స్టాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని వెయ్యిమంది రైతులతో ప్రత్యేక సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేస్తున్నారు. విత్తనాల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు వివరిస్తారు.