రాష్ట్రీయం

టీఆర్టీకీ మార్గం సుగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో టీచర్ల రిక్రూట్‌మెంట్ ద్వారా 8792 మంది టీచర్ల నియామకానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ మెరిట్ జాబితాలను ప్రకటించింది. ఆ జాబితాల ఆధారంగా జిల్లాల వారీ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పాత జిల్లాల వారీ ఎంపిక కమిటీలను కలెక్టర్ల అధ్యక్షతన నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్ధనరెడ్డి జీవో 10ను శనివారం నాడు విడుదల చేశారు. కమిటీలో జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గానూ, డీఈఓ కార్యదర్శిగా ఉంటారు. జిల్లా పరిషత్ సీఈఓ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన మరో సభ్యుడు కమిటీలో ఉంటారు. రాష్ట్రంలో మొత్తం 8792 పోస్టులను భర్తీ చేస్తారు. అందులో 1950 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1011 లాంగ్వేజి పండిట్లు, 416 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, 5415 సెకండరీ గ్రేడ్ టీచర్లు పోస్టులుంటాయి. జిల్లాల వారీ ఎంపికకు రోస్టర్ విధానం పాటిస్తారు. పాత జిల్లాల వారీ అక్కడ పనిచేస్తున్న డీఈఓలు కొత్త జిల్లాల డీఈఓలతో సంప్రదించి, ఖాళీల చార్టులను రూపొందిస్తారు. ఎక్కువ ఎన్‌రోల్‌మెంట్ జరిగి ఉపాధ్యాయులు లేని స్కూళ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి పాఠశాలలో తప్పనిసరి కనీసం ఒక్క టీచర్ అయినా ఉండేలా చూస్తారు. ఖాళీల వారీ అభ్యర్ధులను ఇంటర్వ్యూలకు పిలవాల్సి ఉంటుంది. బాలికల పాఠశాలల్లో మాత్రం కేవలం మహిళా టీచర్లకే కేటాయిస్తారు. ఒక వేళ మహిళా టీచర్లు లభ్యం కాకపోతే వాటిని ఖాళీగా ఉంచుతారు. కౌనె్సలింగ్‌కు హాజరుకాని అభ్యర్ధులకు నియామక ఉత్తర్వులను పోస్టులో పంపిస్తారు. జిల్లాల వారీ విధుల్లో ఎంత మంది చేరారో, ఇంకా ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఎప్పటికపుడు పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు, డిఎస్‌ఈకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ చొరవపై ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో తమ హర్షాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశాయి.