రాష్ట్రీయం

పొరుగు సీఎంలతో సఖ్యత వద్దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి ఆగమేఘాలపై పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవానికి తాను వెళ్లటంపై ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తుండటం ఎంతో ఆశ్చర్యంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాను వెళ్లినా వెళ్లకపోయినా ఎటూ ప్రారంభం ఆగదు కదా అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజైన గురువారం ప్రశ్నోత్తరాల్లో సాగునీటి ప్రాజెక్టులపై వాడివేడిగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి విపక్షాలపై విరుచుకుపడుతూనే ముఖ్యంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గతంలో ఏదేదో జరిగి ఉంటుంది.. ఎవరేదో మాట్లాడి ఉంటారు.. అంతమాత్రాన ఇరుగుపొరుగు సీఎంలతో సఖ్యత అవసరం లేదా అని ప్రశ్నించారు. కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ప్రవహించే జలాల్లో తెలంగాణకు సైతం వాటా ఉందని తెలిసినా రాష్ట్ర విభజనకు నాడు చంద్రబాబు ఎలాంటి షరతులు లేకుండానే ఎలా అంగీకారం తెలిపారంటూ సూటిగా ప్రశ్నించారు. ఇప్పటి విషయం సరే... నాడు కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతున్న సమయంలోనే కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 నుంచి 524 మీటర్ల ఎత్తుకు పెంచుకుంటూ పోతుంటే ఏమి చేసారని ప్రశ్నించారు. అంత ఎత్తుకు పెంచుకుంటూ పోతే మనకు నీళ్లు ఎలా వస్తాయో కనీసం ఆలోచన చేసారా అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలి కానీ ఎందుకు ఈ ఈర్ష్య అని ప్రశ్నించారు. నాసిక్ నుంచి ప్రవహించే గోదావరికి నాలుగు పాయల నుంచి నీటి ప్రవాహం ఉంటుంది.. ప్రధానంగా తెలంగాణా నుంచి ప్రవహించే ప్రాణహిత నుంచి 36 శాతం, ఇంద్రావతి నుంచి 20 శాతం వరద నీరు వస్తుంటే ఏపీలో ఒక్క శబరి నుంచే కేవలం 11 శాతం నీరు చేరుతుంటే కృష్ణాడెల్టా స్థిరీకరణ ఆపై సాగర్, శ్రీశైలం జలాశయాల నింపేందుకు తెలంగాణతో సఖ్యత అవసరం లేదా అని జగన్ ప్రశ్నించారు. గోదావరి జలాలతో ఆ రెండు జలాశయాలు నిండితే తెలంగాణలో నాలుగు, ఏపీలో 8 జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు. ఇందులో స్వార్థం ఉన్నప్పటికీ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఆహ్వానించదగినవే కదా అన్నారు. బాబు హయాంలో ఎగువన నిర్మితమైన అక్రమ ప్రాజెక్ట్‌లతో కృష్ణా డెల్టా ఆయకట్టు మొత్తం ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంటే కేసీఆర్‌తో మాట్లాడితే తనను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తనను అదే పనిగా విమర్శించుకోవటం మానుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించి, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందనేది గుర్తించాలని జగన్ అన్నారు. బాబు ఐదేళ్ల పాలన వలనే ఆంధ్ర రాష్ట్రం అధ్వాన్న స్థితిలో ఉందన్నారు. గోదావరి నీళ్లను పొరుగు సీం కేసీఆర్ సహకారంతో సాగర్, శ్రీశైలంకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంటే ఈర్ష్య ఎందుకంటూ ప్రశ్నించారు. సొంత బావమరిది హరికృష్ణ మృతదేహాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్‌తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడలేదా అని ప్రశ్నించారు.