రాష్ట్రీయం

మెట్రో పనుల్లో మరింత భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14:కలకత్తాలో భారీ ఫ్లై ఓవర్ కూలిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు మెట్రో అధికారులకు సూచించారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష జరిపారు. మెట్రో భవన్‌లో జరిగిన సమీక్షలో ఎల్ అండ్ టి ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మెట్రో రైలు కోసం నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పనులు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాణాలకు సంబంధించి మరిన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు వేగంగా, సురక్షితంగా పనలు చేశారని ఎల్ అండ్ టి సంస్థను కెటిఆర్ అభినందించారు. వర్షాకాలం నేపథ్యంలో ఇప్పటి నుంచే నిర్మాణాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. మెట్రో పనులు నగర ప్రతిష్టకు ప్రధానమైనవని, ప్రపంచమంతా గమనిస్తోందని అన్నారు.