రాష్ట్రీయం

చిగురిస్తున్న ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రజల ఆశలు చిగురిస్తున్నాయి. అనూహ్యంగా మహారాష్ట్ర, కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టికి జలకళ వచ్చేసింది. ఇక ఈ ఏడాదికి ఇంతే సంగతులు అనుకున్న ప్రభుత్వం రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. నెలన్నర రోజుల ఆలస్యంగా వరుణ దేవుడు మహారాష్ట్ర, కర్నాటకలో భారీ వర్షాలు కురిపిస్తున్నాడు. ఆల్మట్టికి జల ప్రవాహం విపరీతంగా ఉంది. ప్రస్తుతం శనివారం సాయంత్రం 6 గంటలకు ఆల్మట్టిలో 85 టీఎంసీ నీరు చేరుకుంది. నాలుగు రోజుల క్రితం వరకు కేవవలం 29 టీఎంసీ నీటితో ఎండిపోయిన ఆల్మట్టికి అంచనాలకు మించి వరద నీరు చేరుతోంది. ఇది కచ్చితంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంత రైతులకు శుభవార్త అని సాగునీటి ఇంజనీర్లు చెప్పారు. తాజా పరిస్థితిని విశే్లషిస్తే ఆల్మట్టిలో మొత్తం నీటినిల్వ సామర్థం 129.72 టీఎంసీ. ప్రస్తుతం 85 టీఎంసీకి చేరుకుంది. ఈ ప్రాజెక్టులోకి 1,09,337 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. కాని గేట్లు మూసివేశారు. ఇదే రీతిలో వరద పోటెత్తితే మాత్రం ఒక వారం రోజుల్లో ఆల్మట్టి నిండుతుంది. ఆల్మట్టి ఓవర్ ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చిన వెంటనే గేట్లు ఎత్తుతారు. ప్రస్తుతం దిగువకు కేవలం ఐదు వేల క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. దిగువన నారాయణ్‌పూర్‌లో 37.65 టీఎంసీకి 19.86 టీఎంసీ నీటి లభ్యత ఉంది. ఆల్మట్టి తర్వాత నారాయణ్‌పూర్ నిండాలి. ఈ రెండు ప్రాజెక్టులు పై నుంచి వరద నీరు ఇదే స్థాయిలో వస్తే కచ్చితంగా నెలాఖరుకు గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. ఆల్మట్టి నుంచి వరద నీటి ప్రవాహం దిగువకు వస్తే ముందుగా జూరాల, శ్రీశైలంకు నీటి లభ్యత వస్తుంది. దీని వల్ల తాగునీటి అవసరాల బెంగ ఉండదు. కాగా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు జలాశయాల్లో నీటి ప్రవాహంలో ఎటువంటి మార్పులు లేవు. కాగా తుంగభద్ర నదికి కూడా వరద నీరు పెరుగుతోంది. కర్నాటకలో తుంగ భద్ర నీటి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల 26వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 100 టీఎంసీ. ఈ ప్రాజెక్టు నీటి లభ్యత ప్రస్తుతం పది టీఎంసీ ఉన్నా, ఇదే ఫ్లో కొనసాగితే, ఈ నెలాఖరుకు నిండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నిండితే గేట్లు ఎత్తితే, నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది.
తుంగభద్ర డ్యాంకు 10 టీఎంసీల నీరు చేరిక
బళ్లారి: గత కొద్ది రోజుల నుంచి తుంగభద్ర జలాశయంలోకి వరద నీరు చేరుతుండడంతో ప్రస్తుతం జలాశయంలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శనివారం ఉదయం జలాశయంలోకి 26,945 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయం నీటి మట్టం 1,590 అడుగులకు చేరిందని, అయితే జలాశయం నుంచి 247 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నట్లు జలాశయం అధికారులు తెలిపారు. గత ఏడాది ఈ సమయానికి జలాశయంలో 60 టీఎంసీల నీరు చేరినట్లు తెలిపారు.
చిత్రం... తుంగభద్ర జలాశయం