రాష్ట్రీయం

ఇక జనంలోకి వెళ్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతో ముందుకెళుతోంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, పార్టీకి సుశిక్షతమైన కేడర్ ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చూపి తీరాలనే పట్టుదలతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు ఆయన 140 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలు, నేతలు సమిష్టిగా పనిచేయాలని గట్టి సంకేతాలు పంపారు. అన్ని జిల్లాల్లో మున్సిపాలిటీల వారీగా కో ఆర్డినేటర్లు, ఇన్‌చార్జీలను టీపీసీసీ నియమించింది. ప్రస్తుతం బాధ్యులైన నేతలు సమావేశాలనునిర్వహిస్తున్నారు. వీరి నుంచి నివేదిక వచ్చిన వెంటనే విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి జనంలోకి వెళ్లాలనే ఆలోచనలో టీపీసీసీ నేతలు ఉన్నారు. ప్రజల్లో
ఉన్న తీవ్ర అసంతృప్తిని చూస్తుంటే ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు వశమవుతాయని పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు నిర్వహణ గడువు అక్టోబర్ వరకు ఉందన్నారు. కాని నెలరోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం దురుద్దేశంతో ఉందన్నారు. ఉన్న చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సింది పోయి, అగమేఘాల మీద కొత్త చట్టం చేయాల్సిన అవసరం ఏముందన్నారు. డిలిమిటేషన్ కూడా గుట్టుచప్పుడు కాకుండా చేశారన్నారు. బైంసా, శంషాబాద్ మున్సిపాలిటీల డిలిమిటేషన్‌లపై కోర్టు స్టే ఇచ్చిందన్నారు. 119 రోజులు గడువు ఇస్తే ప్రభుత్వం తొందరపడుతోందన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు మీటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, రాష్ట్రం కరవుపరిస్థితుల్లో విలవిలలాడుతుంటే, అవసరం లేని సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు చేపడుతామంటున్నారన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందన్నారు. ఈ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించారన్నారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉంటే, కేవలం రెండు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ మెడలనువంచుతారని ఆయన చెప్పరు. హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామన్నారని, కాని అర గంట వర్షం కురిస్తే నగరం అస్తవ్యస్థంగా మారుతోందన్నారు.