రాష్ట్రీయం

ఏపీలో ఆలయాలకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలు, అర్చకుల వేతనాలకు 2019-20 సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో 234 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆలయాలకు మహర్దశ వస్తోందన్నారు. ఆలయాలకు సంబంధించి దేశ చరిత్రలోనే జగన్‌మోహన్‌రెడ్డి నూతన శకం సృష్టించారని ప్రశంసించారు. చిన్న దేవాలయాల అర్చకుల విషయంలో గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఏనాడూ సమీక్షించలేదన్నారు. చిన్న ఆలయాల అర్చకులు అనేక ఇక్కట్లకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకుల సంక్షేమం కోసం గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన జీఓ 76 ను ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు. చిన్న ఆలయాల భూములను అన్యాక్రాంతం చేసిన ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కిందన్నారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన ధూపదీప నైవేద్య (డీడీఎస్) పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి గతంలో చేసిన పాదయాత్ర సందర్భంగా ఆలయాలకు సంబంధించి ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకున్నారని ఆత్రేయబాబు, రాంబాబు పేర్కొన్నారు. ఏటా రెండులక్షల రూపాయలలోగా ఆదాయం ఉన్న ఆలయాలకు డీడీఎస్ పథకాన్ని వర్తింప చేస్తున్నారని, దాంతో ఈ ఆలయాల్లో రోజూ దీపాలు వెలుగుతాయని, అలాగే అర్చకుల జీవితాల్లో కూడా దీపాలు వెలుగుతాయన్నారు. బ్రాహ్మణ కార్పోరేషన్‌కు 100 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల కూడా ఆత్రేయబాబు, రాంబాబు హర్షం వ్యక్తం చేశారు.