రాష్ట్రీయం

తెలంగాణ సరిహద్దుల్లో మావోల కదలికలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఎన్ శ్రీనివాసరావు అనే వ్యక్తిని పోలీసు ఇన్‌ఫార్మార్‌గా ముద్రవేసి మావోయిస్టులు చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. గత ఏడాదిలో రాష్ట్రంలో మావోయస్టుల దుశ్చర్యలకు ముగ్గురు పౌరులు, ఒక పోలీసు మరణించారు. అలాగే గత ఏడాది నుంచి చూస్తే మూడు ఎన్‌కౌంటర్లలో పోలీసుల ఎదురుకాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మరణించారు. పోలీసు వర్గాల అంచనా ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో 100 మందికిపైగా మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో 17 మంది సభ్యుల్లో 10 మంది తెలంగాణ ప్రాంతంవారే. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గాయి. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గిరిజనులు, ఇతర వర్గాల వారు సంతృప్తిగా ఉన్నారు. పైగా మావోయిస్టు పార్టీ నేతలను ఆదరించే స్థితిలో ప్రజలు లేరు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో పెంటయ్య అనే గిరిజనుడు మావోయిస్టుల చేతిలో మరణించాడు. గత ఏడాది మార్చి 18వ తేదీన వికారాబాద్‌కు చెందిన సుశీల్ కుమార్ అనే పోలీసు మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలో మరణించారు. గత ఏడాది జనవరి నెలలో సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో పది మంది మావోయిస్టులు హతమయ్యారు. అంతకు ముందు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో అనే మాజీ నక్సలైటు, గిరిజనుడైన ఎం రమేష్‌పై నక్సలైట్లు కాల్పులు జరిపారు.